News April 12, 2025
ములుగులో నేడు మంత్రి సీతక్క పర్యటన

ములుగు మండలంలో శనివారం మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల భరత్ కుమార్ ప్రకటనలో తెలిపారు. మండలంలోని జంగాలపల్లి, కాసిందేవిపేట, పెగడపల్లి, కొత్తూరు, సర్వాపురం, రాయినిగూడెం, కన్నాయి గూడెం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు.
Similar News
News April 18, 2026
హైదరాబాద్.. అడుగడుగునా ‘షాందార్’

శిలలపై చెక్కిన కావ్యంలా హైదరాబాద్ అడుగడుగునా ‘షాందార్’ అనిపిస్తుంది. చార్మినార్ దర్పం, గోల్కొండ కోట శబ్ద విన్యాసాలు, కుతుబ్ షాహీ సమాధుల కళా వైభవం నగరానికి మణిహారాలు. నిజాంల విలాసానికి ప్రతీక చౌమహల్లా ప్యాలెస్. బన్సీలాల్‌పేట్ మెట్ల బావి కూడా గొప్ప వారసత్వం, సంస్కృతికి సాక్ష్యాలు. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. గోల్కొండ, చార్మినార్ గోడలపై పిచ్చి రాతలు వద్దు. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం.
News April 18, 2026
హైదరాబాద్.. అడుగడుగునా ‘షాందార్’

శిలలపై చెక్కిన కావ్యంలా HYD అడుగడుగునా ‘షాందార్’ అనిపిస్తుంది. చార్మినార్ దర్పం, గోల్కొండ కోట శబ్ద విన్యాసాలు, కుతుబ్ షాహీ సమాధుల కళా వైభవం నగరానికి మణిహారాలు. నిజాంల విలాసానికి ప్రతీక చౌమహల్లా ప్యాలెస్. బన్సీలాల్‌పేట్ మెట్ల బావి, సాలార్జంగ్ మ్యూజియం గొప్ప వారసత్వం, సంస్కృతికి సాక్ష్యాలు. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. చరిత్ర గుర్తులపై పిచ్చి రాతలు వద్దు. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం.
News April 18, 2026
జైపూర్: సీసీ కెమెరాలు అమర్చుతూ యువకుడి మృతి

జైపూర్‌లోని కేజీబీవీ వసతి గృహంలో సీసీ కెమెరాలు అమర్చుతూ శివ(29) అనే వర్కర్ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. స్టాండ్‌పై నుంచి పడి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి అన్న విజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది.


