News April 12, 2025
హైస్కూల్ ప్లస్‌లలో ఇంటర్‌పై కీలక నిర్ణయం

AP: గత ప్రభుత్వం ప్రారంభించిన 294 హైస్కూల్ ప్లస్‌లలో ఇంటర్‌ను ఈ ఏడాదీ కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో పనిచేసే టీచర్లకు అక్కడే కొనసాగేలా లేదా బదిలీ కోరుకునేలా అవకాశం కల్పించింది. మరో 210 చోట్ల ఇంటర్ విద్యను తిరిగి ఇంటర్మీడియట్ శాఖకు అప్పగించనుంది. అందులోని టీచర్లను వెనక్కు తీసుకుని ఇతర స్కూళ్లలో నియమించనుంది. అలాగే 900 హైస్కూళ్లలో ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు త్వరలో అనుమతులు ఇవ్వనుంది.
Similar News
News July 7, 2025
జులై 7ను జీవితంలో మరిచిపోలేను: రేవంత్ రెడ్డి

తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ‘నియంతృత్వాన్ని సవాల్ చేసి.. నిర్భందాన్ని ప్రశ్నించి, స్వేచ్ఛ కోసం యుద్ధం ప్రకటించిన సందర్భం అది. నేటి ప్రజా పాలనకు నాడు సంతకం చేసిన సంకల్పం. సోనియా గాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ అండతో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జులై 7ను జీవితంలో మరచిపోలేను’ అని ఆయన Xలో రాసుకొచ్చారు.
News July 7, 2025
విద్యార్థులతో మాట్లాడుతూ లోకేశ్ ఎమోషనల్

AP: మంత్రి నారా లోకేశ్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇద్దరు భిక్షాటన చేసే చిన్నారులు అధికారుల చొరవతో తాజాగా స్కూళ్లో చేరగా వారికి భవిష్యత్తులో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ.. పేదరికం నుంచి బయటపడేలా చేసే శక్తిమంతమైన సాధనం విద్య అని లోకేశ్ చెప్పారు. తాను ఈ స్థాయికి ఎదిగేందుకు తన తల్లే కారణమని, ఆమె వల్లే క్రమశిక్షణ అలవడిందని మంత్రి ఎమోషనల్ అయ్యారు.
News July 7, 2025
యాక్టర్ల ఫోన్ ట్యాపింగ్‌కు ఆధారాల్లేవని పోలీసులు చెప్పారు: BRS

TG: ఫోన్ ట్యాపింగ్ పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర బయటపడిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ‘సినీ నటుల ఫోన్ ట్యాపింగ్‌కు ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. పచ్చ మీడియాతో కుమ్మక్కై ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడిన రేవంత్ సర్కార్ కుట్ర ఇది అని తేటతెల్లమైంది’ అంటూ ఓ న్యూస్ క్లిప్పింగ్‌ను షేర్ చేసింది.