News April 12, 2025
కాకాణి జైలుకు వెళ్లడం ఖాయం: సోమిరెడ్డి

అధికారంలో ఉన్నప్పుడు క్వార్ట్జ్ ను తవ్వేసి అమ్ముకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ దాక్కొన్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. వెంకటాచలంలో శుక్రవారం జరిగిన AMC సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోమిరెడ్డి మాట్లాడారు. తోపునని తనకు తానే వర్ణించుకున్న కాకాణి దొరికితే జైలుకు వెళ్లడం ఖామన్నారు. కాకాణి మనుషులు మాట్లాడే భాష సరిగా లేదని మండిపడ్డారు.
Similar News
News April 6, 2026
ఉదయగిరి MLAపై మంత్రికి మహిళ ఫిర్యాదు!

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌పై వెంగమాంబ అనే మహిళ ఇటీవల వరుస ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కర్ణాటక రాష్ట్రం రాయచూర్ పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌ను ఆమె కలిశారు. ఉదయగిరిలో ఇటీవల జరిగిన పరిణామాలను ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. వింజమూరుకు సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు ఆయనను కలవనీయకుండా పోలీసులు తనను అడ్డుకోవడంలో ఎమ్మెల్యే పాత్ర ఉందని లోకేశ్‌కు చెప్పినట్లు సమాచారం.
News April 6, 2026
నెల్లూరు జిల్లాలో ధరల పెంపు

నెల్లూరు జిల్లాలో విజయ డెయిరీ పాల సేకరణ ధరలు పెరిగాయి. నేటి నుంచే అమలు చేస్తున్నామని డెయిరీ ఛైర్మన్ వెంకట ప్రసాద్ వెల్లడించారు. గేదె పాలకు కేజీ వెన్న శాతం గతంలో రూ.800 ఉండగా రూ.820కి పెంచామని చెప్పారు. రైతులకు లీటరు పాలపై అదనంగా రూ.1.28 అందుతుందన్నారు. ఆవు పాలకు గతంలో రూ.265 ఉండగా ఇప్పుడు రూ.290 చేశామని.. లీటరు ఆవు పాలపై రైతుకు అదనంగా రూ.3 చెల్లిస్తామని చెప్పారు.
News April 6, 2026
NLR: ‘ఫేస్ వాష్ అండ్ గో’తో ప్రమాదాలకు చెక్

నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రాత్రిపూట హైవేలపై ప్రయాణించే బస్సులు, లారీ డ్రైవర్లను నిలుపుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వారి నిద్రమత్తు వదిలించేందుకు ముఖం కడిగిస్తున్నారు.


