News April 12, 2025
కంచిలి: తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తె

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చిన్న కొజ్జిరియా గ్రామానికి చెందిన పి జగన్మోహిని అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆమె కుమారుడు శివాజీ బెంగళూరులో వలస కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. మరణ వార్త తెలిసి వచ్చినప్పటికీ ఆయన భార్య గర్భిణి కావడంతో అంత్యక్రియలు చేసేందుకు అవకాశం లేదని గ్రామస్థులు తెలిపారు. ఈ క్రమంలో అవివాహితగా ఉన్న కుమార్తె నాగమ్మ తన తల్లి మృతదేహానికి తలకొరివి పెట్టి దహన సంస్కారాలు చేశారు.
Similar News
News January 5, 2026
SKLM: పది పాసైతే చాలు 350 ఉద్యోగాలు

ఈనెల 7న కొత్తూరులోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి సాయికుమార్ ఆదివారం తెలిపారు. 10 కంపెనీలకు చెందిన యాజమాన్యాలు 350 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివి 18-30 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News January 5, 2026
శ్రీకాకుళం: జనవరి 5న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నేడు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.