News April 12, 2025

అన్నమయ్య: ముగ్గురు బాలురు మృతి

image

ఆడుకోవడానికి ఊరు సమీపంలోని కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి శుక్రవారం ముగ్గురు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. చిట్వేలు మండలం మైలపల్లి పంచాయతీ రాచపల్లికి చెందిన చొక్కరాజు దేవాన్ష్ (5), చొక్కరాజు విజయ్ (4), రెడ్డిచర్ల యశ్వంత్(5) ప్రమాదవశాత్తు నీటి కుంటలో మునిగి చనిపోయారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పిల్లల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News April 6, 2026

కాకినాడ: రెండు లేగదూడలను చంపిన పులి

image

కాకినాడ జిల్లాలో ఐదు రోజులు తిరిగిన పులి ప్రస్తుతం పోలవరం జిల్లా దండంగి కొండల్లో మకాం వేసింది. పూడిపల్లి వద్ద రెండు లేగదూడలను పులి హతమార్చినట్లు అటవీశాఖ ధ్రువీకరించింది. పాపికొండలు, గోదావరి నదీ తీరం పులికి అనుకూలంగా మారిందని స్థానికులు తెలిపారు. పులి సంచారం కారణంగా గిరిజనులు కూలి పనులకు వెళ్లలేకపోతున్నారు. ఎత్తైన పచ్చని కొండల ప్రాంతంలో పులి మకాం వేయడంతో స్థానికులు కునుకు లేకుండా గడుపుతున్నారు.

News April 6, 2026

ASF: రెండు మున్సిపాలిటీల్లో కో- ఆప్షన్ సందడి..!

image

ఆసిఫాబాద్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల సందడి మొదలైంది. ఖాళీగా ఉన్న పదవుల కోసం ఆశావహుల సంఖ్య పెరగడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీ నేతల వద్ద ఆశావహులు పైరవీలు ముమ్మరం చేశారు. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయతను ప్రాతిపదికగా తీసుకొని తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కౌన్సిలర్ల మద్దతు కూడగట్టేందుకు నేతలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు.

News April 6, 2026

విశాఖ: ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో వేట నిషేధం

image

తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఈస్ట్ కోస్ట్‌లో చేపల వేటపై 61 రోజుల నిషేధం అమల్లోకి రానుంది. మెకానైజ్డ్, మోటరైజ్డ్ పడవలకు నిషేధం వర్తించగా, సంప్రదాయ పడవలకు మినహాయింపు ఇచ్చారు. ఏపీ గణాంకాల ప్రకారం విశాఖలో 12,995 మందిని గుర్తించగా, 12,138 మంది అర్హులుగా ఉన్నారు. అనకాపల్లిలో 12,644 మంది లబ్ధిదారులు ఉన్నారు. ‘మత్స్యకార సేవ’ పథకం కుటుంబ సభ్యులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు.