News April 12, 2025

VJA: ఇంటర్ బాలికల అదృశ్యం.. గుర్తించిన పోలీసులు

image

ఇంటర్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతామనే భయంతో ఇద్దరు బాలికలు ఇళ్లను వదిలి వెళ్లిన ఘటన తాడేపల్లిలో చోటుచేసుకుంది. విజయవాడలోని ఓ ప్రయివేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాలికలు గత రాత్రినుంచి కనపడటం లేదని తాడేపల్లి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ కళ్యాణ్ రాజు టెక్నాలజీ సహాయంతో హైదరాబాదులో వారిని గుర్తించి తాడేపల్లి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

Similar News

News March 14, 2026

ఏలూరు: పదోన్నతుల కోసం జిల్లా ఎస్పీకి బురిడీ

image

ఏలూరు జిల్లాలో ఏఎస్ఐ పదోన్నతుల వ్యవహారంలో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్‌ను తప్పుదారి పట్టించేందుకు యత్నించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పదోన్నతుల కోసం సమర్పించిన వినతిపత్రంలో మరో సహోద్యోగి సంతకాన్ని వీరు ఫోర్జరీ చేసినట్లు ఎస్పీ గుర్తించారు. పోలీసులే స్వయంగా ఫోర్జరీకి పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 14, 2026

ఇండక్షన్ స్టవ్‌లు వాడేవారికి తమిళనాడు ప్రభుత్వం గుడ్‌న్యూస్

image

గ్యాస్ సంక్షోభం వేళ విద్యుత్ స్టవ్‌లు వినియోగించే వ్యాపారులకు TN ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెస్టారెంట్లు, హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు, టీ స్టాల్స్‌లో కరెంట్ యూనిట్‌పై రూ.2 సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. కమర్షియల్ సిలిండర్ల విషయంలో కేంద్రం విధించిన షరతులు అమల్లో ఉన్నన్ని రోజులు ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే పలు రాష్ట్రాల్లో కమర్షియల్ సిలిండర్ల పంపిణీ ప్రారంభమైనట్లు తాజాగా కేంద్రం పేర్కొంది.

News March 14, 2026

పదో తరగతి పరీక్షలకు పటిష్ఠమైన బందోబస్తు: ఎస్పీ

image

పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అనంతపురం ఎస్పీ జగదీశ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరిగే పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద, ప్రశ్నపత్రాలు తీసుకుని వెళ్లే సమయంలో బందోబస్తు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.