News April 12, 2025
చాగల్లు: బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ శిక్ష

బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి ఏలూరు పోక్సో న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. చాగల్లు(M) ఊనగట్లకు చెందిన 16ఏళ్ల బాలికను రాజమండ్రి రూరల్ నామవరానికి చెందిన శ్రీను 2017లో అత్యాచారం చేశాడు. దీనిపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిన్న శ్రీనుకు పోక్సో కోర్టు న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.
Similar News
News August 18, 2025
తూర్పు గోదావరి జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
News August 17, 2025
తూ.గో: రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మ.1 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలు తమ అర్జీలను అందజేయొచ్చన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గూర్చి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
News August 17, 2025
రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. వర్షాల కారణంగా పంటలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని, రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. పంటల రక్షణ కోసం శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని కలెక్టర్ సూచించారు.