News April 12, 2025

HYD: నేడు మద్యం దుకాణాలు బంద్

image

హనుమాన్ జయంతి సందర్భంగా జంట నగరాలు.. HYD, సికింద్రాబాద్‌లో మద్యం దుకాణాలను మూసేయాలని పోలీసు శాఖ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కల్లు కాంపౌండ్లు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉండే బార్లను బంద్ చేయాలని సూచించింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Similar News

News April 13, 2025

బాలానగర్‌ ఘటన.. మృతుడి వివరాలు (UPDATE)

image

బాలానగర్‌లో RTC బస్ కింద పడి ఓ బైకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు AP కొనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు(బాబ్జీ)గా పోలీసులు గుర్తించారు. రన్నింగ్‌లో ఉన్న వెహికిల్‌ను ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని PSలో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 13, 2025

HYD: అశ్లీల చిత్రాలు చూస్తున్నారా? జాగ్రత్త..!

image

సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసినా, ఇతరులకు షేర్ చేసినా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని HYD టప్పాచబుత్రా పోలీసులు Xలో పోస్ట్ చేశారు. ఇటీవల HYD శివారు మిరుదొడ్డిలో యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తూ SMలో పోస్ట్ చేశాడు. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ అధికారులు అతడిని రిమాండ్ చేసి.. ఫోన్, సిమ్ స్వాధీనం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. లైక్‌ల కోసం వీటిని పోస్ట్ చేయొద్దని, SMని మంచికోసం వాడాలని సూచించారు.

News April 13, 2025

Orange: HYDలో సరిపోయింది ఈ శనివారం

image

ఈ శనివారం HYD‌ వాసులకు గుర్తుండిపోయే రోజు. వీర హనుమాన్ విజయయాత్ర జరిగిన నగరంలోనే ఆరెంజ్ ఆర్మీ జైత్ర యాత్ర కొనసాగింది. ఉదయం నుంచి ఓ ఆర్మీ జై శ్రీరామ్ నినాదాలతో HYDను హోరెత్తించగా.. మరో ఆర్మీ ఉప్పల్ స్టేడియంలో చెలరేగిపోయింది. ఎటు చూసినా కాషాయజెండాలే దర్శనమిచ్చాయి. భక్తుల పూజలు, హనుమంతుడి అనుగ్రహంతో ఆరెంజ్ ఆర్మీ ఘన విజయం సాధించిందని హైదరాబాద్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

error: Content is protected !!