News April 12, 2025
సంచలన తీర్పు: కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష

TG: సొంత కూతుర్ని హత్య చేసిన తల్లికి సూర్యాపేట జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మోతే మండలంలోని మేకపాటి తండాకు చెందిన ఓ మహిళ, మానసిక స్థితి సరిగ్గా లేదన్న కారణంతో తన కుమార్తెను హత్య చేసింది. 2021లో ఇది జరగ్గా అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. ఎట్టకేలకు నిన్న జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.
Similar News
News March 16, 2026
PHOTOS: శ్రీశైలం ఉత్సవాలు.. భృంగి వాహనంపై ఆది దంపతులు

AP: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు శ్రీస్వామి అమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార మండపంలో ప్రత్యేక పూజలు అందుకున్న ఉత్సవమూర్తులకు వైభవంగా గ్రామోత్సవాన్ని జరిపించారు. గ్రామోత్సవం ముందు వివిధ కళారూపాల ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించింది. ఈనెల 20 వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
News March 16, 2026
200 మందికి పైగా పిల్లలు మృతి: ఇరాన్

US, ఇజ్రాయెల్ దాడుల్లో వందలాది ఇరానియన్లు చనిపోయారని ఆ దేశ ఫారిన్ మినిస్టర్ అరాఘ్చీ తెలిపారు. ఇందులో 200 మందికి పైగా పిల్లలున్నారని వెల్లడించారు. ఇరానియన్లను చంపడాన్ని పొరుగు దేశాలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ‘మేం సీజ్‌ఫైర్ వద్దనేది యుద్ధం కోసం కాదు. శత్రువులు మాపై మరోసారి దాడులు చేయకుండా ఉండేలా ఈ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నాం. ఇప్పటికే వారికి గుణపాఠం చెప్పాం’ అని పేర్కొన్నారు.
News March 16, 2026
రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ గెలుపు

బిహార్ CM నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రంలో 5 స్థానాలకు ఎన్నికలు జరగ్గా NDA కూటమి అన్నింటినీ కైవసం చేసుకుంది. నితీశ్ కుమార్‌తో పాటు BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎంపీలుగా ఎన్నికయ్యారు. దీంతో నితీశ్ త్వరలోనే CM పదవికి రాజీనామా చేయనున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ MP, MLA, MLCగా పనిచేశానని, రాజ్యసభ పదవితో మిగిలిన ఆ కోరిక నెరవేరబోతుందని చెప్పిన విషయం తెలిసిందే.


