News April 12, 2025
గద్వాల: రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

మల్దకల్ వాసి రామకృష్ణ శుక్రవారం <<16064365>>సూసైడ్ చేసుకున్న<<>> విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్‌జెండర్‌తో తన భర్తకు పరిచయం ఉందని,వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని, అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే రామకృష్ణ మృతదేహాన్ని ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇది హత్యేనని భార్య ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News December 31, 2025
MBNR: ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తు గడువును 3.3.2026 తేదీ వరకు పొడిగించినట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎస్సీడీ. డి. సునీత ఒక ప్రకటన తెలిపారు. వివిధ కోర్సులలో విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉపకార వేతనాలు పొందేందుకు https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News December 31, 2025
MBNR: 26,220 యూరియా ఉంది: వ్యవసాయ అధికారి

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 17,610 మంది రైతులు నేటి వరకు 52,545 యూరియా బ్యాగ్స్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేష్ తెలిపారు. అందులో 46,193 బ్యాగ్స్ రైతులు కొనుగోలు చెయ్యగా.. ఇంక 26,220 యూరియా బస్తాలు యాప్‌లో కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెంద కుండా యూరియా బుకింగ్ యాప్ ద్వారా కొనుగోలు చేయాలని వెల్లడించారు.
News December 31, 2025
MBNR: ఉద్యోగ నియామకాలు.. ప్రత్యేక సమావేశం

మహబూబ్‌నగర్‌లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇవాళ జర్మనీ భాష, ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. వయస్సు 22-38 సంవత్సరాలు ఉండాలని, BSc నర్సింగ్, GNM అర్హత కలిగిన వారు అర్హులని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


