News April 12, 2025
గద్వాల: రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

మల్దకల్ వాసి రామకృష్ణ శుక్రవారం <<16064365>>సూసైడ్ చేసుకున్న<<>> విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్‌జెండర్‌తో తన భర్తకు పరిచయం ఉందని,వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని, అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే రామకృష్ణ మృతదేహాన్ని ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇది హత్యేనని భార్య ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News January 7, 2026
వివాహ ఆటంకాలను తొలగించే సర్ప దోష నివారణ

జాతకంలో సప్తమ, అష్టమ స్థానాల్లో రాహువు లేదా కేతువు ఉన్నప్పుడు సర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల సంబంధాలు చివరి నిమిషంలో చెడిపోతుంటాయి. ఈ దోష నివారణకు కాళహస్తి వంటి క్షేత్రాల్లో రాహు-కేతు శాంతి పూజ చేయించుకోవడం ఉత్తమం. ఇంట్లో రోజూ దుర్గా చాలీసా పఠిస్తే రాహువు ప్రభావం తగ్గుతుంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల వివాహానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి.
News January 7, 2026
25 రన్స్ చేస్తే సచిన్‌ను దాటనున్న కోహ్లీ!

ఈ నెల 11న ప్రారంభమయ్యే NZతో వన్డే సిరీస్‌లో సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టే అవకాశాలున్నాయి. మరో 25 పరుగులు చేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వేగంగా 28వేల పరుగులకు చేరుకున్న క్రికెటర్‌గా నిలవనున్నారు. కోహ్లీ 3 ఫార్మాట్లలో కలిపి 623 ఇన్నింగ్స్‌లో 27,975 రన్స్ చేశారు. మరోవైపు 28వేల రన్స్ మైలురాయిని అందుకోవడానికి సచిన్‌కు 644 ఇన్నింగ్స్ అవసరం కాగా, సంగక్కర 666 ఇన్నింగ్స్ ఆడారు.
News January 7, 2026
BREAKING.. కొవ్వూరు జాతీయ రహదారిపై దగ్ధమైన బస్సు

తూ.గో. జిల్లా కొవ్వూరు గామాన్ బ్రిడ్జి సమీపంలోని జాతీయ రహదారిపై ఆర్ఆర్ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. తెల్లవారు జామున 3గం.కు బస్సు సెల్ఫ్ మోటార్‌లో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సు ఖమ్మం నుంచి విశాఖ వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు.


