News April 12, 2025
నేడే రిజల్ట్.. నంద్యాల జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. నంద్యాల జిల్లాలో ఫస్టియర్ 15,692 మంది, సెకండియర్ 13,400 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News July 7, 2025
పాశ మైలారం: ఆచూకీ తెలియని 8 మంది వివరాలు

పాశ మైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. వెంకటేశ్, రవి, రాహుల్, విజయ్, ఇర్ఫాన్, అఖిలేశ్, జస్టిన్, శివాజీ ఆచూకీ లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి. వీరి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు పటాన్‌చెరులోనే పడిగాపులు కాస్తున్నారు.
News July 7, 2025
PHOTO OF THE DAY..❤❤

అమ్మానాన్న లేరు. వీధివీధి తిరిగి భిక్షం ఎత్తుకోవడం, బస్టాండ్లలో నిద్రపోయే దీనపరిస్థితి ఆ ఇద్దరు చిన్నారులది. వాళ్లకూ ఓ మంచిరోజు వచ్చింది. ‘<<16930776>>సార్.. మేమూ చదువుకుంటాం<<>>’ అంటూ నెల్లూరు VRస్కూల్ వద్ద మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్‌ను వేడుకోవడంతో వారి జీవితం మారిపోయింది. వారం తిరగకముందే మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అదే స్కూల్లో అడ్మిషన్లు పొందారు. ఇప్పుడు ఆ ఇద్దరూ అందరిలా పాఠాలు నేర్చుకోనున్నారు.
News July 7, 2025
రోడ్డు ప్రమాదంలో ఆపరేషన్ సింధూర్ జవాన్ మృతి

పెదనందిపాడు మండలం వరగానికి చెందిన నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భారత్-పాక్ యుద్ధ సమయంలో ఆపరేషన్ సింధూర్‌లో సేవలందించిన ఆయన, కుటుంబంతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా నల్గొండ దగ్గర వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో నాగేశ్వరరావు కుమారుడు అవినాశ్ అక్కడికక్కడే మృతి చెందగా, నాగేశ్వరరావు చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో మరణించారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.