News April 12, 2025

MDK: రాజీవ్‌ యువ వికాసం.. ఈనెల 14 వరకే ఛాన్స్

image

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్‌ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శుక్రవారం వరకు మెదక్ జిల్లాలో 16వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 14 వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.

Similar News

News April 15, 2025

మెదక్: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

image

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. వివరాలు.. సంగారెడ్డి ఓఆర్ఆర్ పై టెంపో వాహనం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో డ్రైవర్ మాదయ్య మృతి చెందాడు. కొల్లూరులో బైక్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో ప్రభాకర్ మృతి చెందగా, పుల్‌కల్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో అల్లాదుర్గం(M)కు చెందిన జర్నయ్య బైక్ పై వస్తూ లారీని ఢీకొట్టి మృతి చెందాడు. కొండపాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా వాసి అనిల్ మృతి చెందాడు.

News April 15, 2025

సంగారెడ్డి: కాపురానికి రమ్మంటే రావడం లేదని హత్య

image

భార్యను భర్త <<16097179>>హత్య చేసిన<<>> ఘటన పటాన్ చెరులో జరిగిన విషయం తెలిసిందే. వివరాలు.. జిన్నారం(M) కిష్టాయిపల్లికి చెందిన సురేశ్‌కు పటాన్ చెరు (M) పెద్ద కంజర్ల వాసి రమీలా(24)తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో రమీలా తల్లి దగ్గరికి వెళ్లింది. కాపురానికి రమ్మంటే రావడం లేదని అత్తగారి ఇంటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవ పడి రోకలి బండతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది.

News April 15, 2025

మెదక్: కొడుకుతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం

image

కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నర్సాపూర్‌లో జరిగింది. ఎస్ఐ లింగం వివరాలు.. నర్సాపూర్‌కు చెందిన మన్నె జయమ్మ నాలుగేళ్ల కొడుకుతో రాయరావు చెరువులోకి దిగుతుండగా వాచ్‌మెన్ రమేశ్ గమనించి విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి తల్లి, కొడుకును రక్షించి PSకు తరలించారు. కుటుంబ కలహాలతోనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుందని జయమ్మ తెలిపిందని ఎస్ఐ వెల్లడించారు.

error: Content is protected !!