News April 12, 2025

వనజీవి రామయ్య కన్నుమూత

image

TG: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో గుండెపోటుతో మరణించారు. కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరు గాంచిన ఆయనను 2017లో కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి.

Similar News

News January 12, 2026

వారాన్ని బట్టి పందెం పుంజులను బరిలో దింపుతారు

image

కుక్కుట శాస్త్రం ప్రకారం నక్షత్రాలను బట్టి అనుకూల రంగులున్న కోళ్లను బరిలోకి దింపుతారట. పందెం కట్టేవాళ్లు ఇంటికి బరి ఏ దిక్కున ఉందో చూసుకోవడంతో పాటు పేరులో తొలి అక్షరాన్ని బట్టి దిక్కును నిర్ణయించుకుంటారట. ఆది, శుక్రవారం అయితే ఉత్తర దిశ నుంచి.. సోమ, శనివారం అయితే దక్షిణ దిశ నుంచి.. మంగళవారం తూర్పు దిశ నుంచి బుధవారం, గురువారం పడమర దిశ నుంచి కోళ్లను బరిలోకి దింపుతారట. వారాన్ని బట్టి ఈ దిశ మారుతుంది.

News January 12, 2026

తగ్గిన చలి.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇవాళ చిత్తూరు, TPT, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, NLR, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో మన్యం జిల్లాల్లో చలి తీవ్రత తగ్గింది. నిన్న జి.మాడుగులలో 12.6 డిగ్రీలు, అరకులో 13.5, చింతపల్లిలో 14.2 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టంగా అలుముకున్న పొగమంచు కూడా తగ్గింది.

News January 12, 2026

జంతికలు కరకరలాడుతూ రావాలంటే?

image

జంతికలు కరకరలాడాలంటే కప్పు బియ్యప్పిండికి రెండు కప్పుల సెనగపిండి తీసుకుని గోరువెచ్చని నీళ్లతో కలపాలి. పిండిలో వాము, వెన్న వేయాలి. గట్టిగా, మరీ జారుగా కాకుండా కలపాలి. అలాగే ముద్ద కలిపిన తర్వాత తడి వస్త్రంతో పైన కప్పేయాలి. 15 నిమిషాల తర్వాతే ఆ పిండిని వాడాలి. అలాగే వేయించేటప్పుడు జంతికలని ఎక్కువ సేపు నూనెలో ఉంచొద్దు. అలా ఉంచితే జంతికలు గట్టిగా ఉంటాయి. రంగుమారగానే జంతికల్ని బయటకు తీసేయాలి.