News April 12, 2025
బాపట్ల: రెండు కుటుంబాల మధ్య చిచ్చు రేపిన వివాహేతర సంబంధం

బాపట్ల జిల్లాలో వివాహేతర సంబంధం 2 కుటుంబాల మధ్య చిచ్చురేపింది. విజయలక్ష్మీపురానికి చెందిన లక్ష్మీనారాయణ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అతని భార్యకు కంటి సంబంధిత సమస్య ఉండటంతో హైదరాబాదుకు తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. అతని ప్రయాణానికి ప్రియురాలు నిరాకరించడంతో గురువారం లక్ష్మీనారాయణ, శుక్రవారం ప్రియురాలు పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సీఐ తెలిపారు.
Similar News
News November 14, 2025
అమృతం యాప్ పనితీరుపై అధికారులకు శిక్షణ

RGM మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులకు ట్యాబ్‌లు అందజేశారు. సాంకేతిక సహకారంతో JIO ట్యాగింగ్, సర్వేల నమోదు, సమస్యల పరిశీలన వంటి పనులు వేగవంతమవుతాయని కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. ప్రజలు తమ సమస్యలు ప్రత్యక్షంగా లేదా ఫోన్ ద్వారా వార్డు అధికారులకు తెలియజేయాలని సూచించారు. నల్లా కనెక్షన్ వివరాలు అమృతం యాప్‌లో నమోదు చేసే విధానంపై అధికారులు శిక్షణ పొందారు. సమావేశంలో గురువీర, రామన్ తదితరులు పాల్గొన్నారు.
News November 14, 2025
బాలల దినోత్సవం.. వరంగల్ పోలీసుల సందేశం

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీసులు పిల్లల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. సైబర్ ముప్పులు, వేధింపుల నుంచి రక్షించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రతి పౌరుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తు రక్షణలో సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అత్యంత కీలకమని పోలీసులు తెలిపారు.
News November 14, 2025
ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు వచ్చినా..!

ప్రతిపక్ష ఆర్జేడీని మరోసారి పరాజయం వెంటాడింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినా అదే స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. 143 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ 22.84 శాతం ఓట్లు సాధించింది. ఇవి బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే 1.86 శాతం, జేడీయూ కంటే 3.97 శాతం ఎక్కువ. ప్రస్తుతం 26 సీట్లలోనే ఆర్జేడీ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఎన్డీయే 204 స్థానాల్లో లీడ్‌లో ఉంది.


