News April 12, 2025
గుంటూరు: నేడు ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూపులు..!

గుంటూరు జిల్లాలో 71,634 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 35,688 మంది ఫస్టియర్, 35,946 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఫలితాల విషయంలో ఎవరూ ఒత్తిడికి గురి కావొద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.
Similar News
News December 26, 2025
GNT: దిగ్గజ నిర్మాత ఏ.వి సుబ్బారావు

గుంటూరు జిల్లా అనంతవరంనకు చెందిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఏ.వి సుబ్బారావు తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి ఆణిముత్యాలను ఆయన నిర్మించారు. తెలుగు సినిమా స్వర్ణయుగానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రానికి గాను తెలుగులో తొలి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. నిర్మాతగానే కాకుండా స్టూడియో అధినేతగానూ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అమోఘం.
News December 26, 2025
GNT: మృతిచెందిన వృద్ధురాలు మీకు తెలుసా.?

గుంటూరు కలెక్టరేట్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధురాలిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు నగరంపాలెం పోలీసులు తెలిపారు. గురువారం వృద్ధురాలు పడిపోయి ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది ఆసుపత్రిలో చేర్చారన్నారు. చికిత్స పొందుతూ మరణించిన ఆమె ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
News December 26, 2025
GNT: సినీ జగత్తులో శాశ్వత వెలుగు.. మహానటి సావిత్రి

తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన మహానటి సావిత్రి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. 1935లో గుంటూరు జిల్లా చిర్రావూరులో జన్మించిన ఆమె, అతి తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగి, సావిత్రి అంటేనే అభినయం అనే స్థాయికి చేరారు. మాయాబజార్‌లో శశిరేఖ పాత్రతో అమరత్వం పొందిన ఆమె, భావోద్వేగాలకు ప్రాణం పోసిన నటిగా సినీ చరిత్రలో నిలిచారు. @నేడు ఆమె వర్ధంతి.


