News April 12, 2025
పాఠ్యాంశాల్లో ‘వనజీవి’ జీవిత కథ

TG: వనజీవి <<16071045>>రామయ్య<<>> అసలు పేరు దరిపల్లి రామయ్య. వృక్షో రక్షతి రక్షితః అంటూ మొక్కల పెంపకాన్ని ప్రచారం చేశారు. తన కుటుంబ సభ్యులకు చెట్ల పేర్లను పెట్టడం ప్రకృతి పట్ల ఆయన ప్రేమకు నిదర్శనం. గత ప్రభుత్వం హరితహారంలో ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇంటికి ఎవరు వచ్చినా ఒక మొక్కను గిఫ్ట్‌గా ఇచ్చేవారు. ఆయన కృషిని గౌరవిస్తూ ప్రభుత్వం 6వ తరగతి పాఠ్యాంశాల్లో రామయ్య జీవితాన్ని చేర్చింది.
Similar News
News March 21, 2026
గ్రీన్ 2 ఓవర్లే వేస్తే రూ.2 కోట్లు కట్ చేయాలి: అశ్విన్

KKR ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై మాజీ క్రికెటర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన 2 ఓవర్లే బౌలింగ్ వేస్తే ఫీజు నుంచి రూ.2 కోట్లు కట్ చేయాలి. 4 ఓవర్ల కోటా పూర్తి చేయకపోతే డబ్బును తగ్గించే హక్కు IPL ఫ్రాంచైజీలకు ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు. IPLలో గ్రీన్ 4 ఓవర్లు వేయడానికి AUS అనుమతిస్తుందా? అనేది వేచి చూడాలన్నారు. కాగా గాయాలు కాకుండా ఉండేందుకు గ్రీన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా పరిమితులు విధించింది.
News March 21, 2026
ఏకంగా 20 కోతుల దాడి.. అక్కడికక్కడే మృతి

తెలుగు రాష్ట్రాల్లో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ వృద్ధురాలి ప్రాణం తీశాయి. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంకు చెందిన చిన్న బుల్లెమ్మ(65) గేదెకు నీరు పెడుతుండగా కోతులు గుంపులుగా వచ్చి ఆమెపై దాడి చేశాయి. ఏకంగా 20 కోతులు ఒకేసారి మీద పడటంతో తప్పించుకొనే అవకాశం లేకుండా పోయింది. తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరి మీ దగ్గరా కోతుల బెడద ఉందా? కామెంట్ చేయండి.
News March 21, 2026
ఈనెల 23న ₹1.35లక్షల కోట్ల ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన

AP: రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. ప్రతిష్ఠాత్మక ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ఈనెల 23న శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో ₹1,35,964 కోట్లతో ఇది ఏర్పాటు కానుంది. ఏటా 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తే లక్ష్యంగా 5,465 ఎకరాల్లో రెండు ఫేజుల కింద దీనిని నిర్మిస్తున్నారు.


