News April 12, 2025

మెదక్: డబ్బుల కోసం మహిళ హత్య.. నిందితుడి అరెస్ట్

image

నర్సాపూర్ మం. జైరాంతండాకు చెందిన మెఘావత్ భుజాలీ(52) మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. అయ్యగారిపల్లెకు చెందిన పాత నేరస్థుడు, కెథావత్ గోపాల్ డబ్బుల కోసం ఆమెను హత్య చేసినట్లు మెదక్ SP ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మద్యం తాగించి ఉరేసి హత్య చేసినట్లు చెప్పారు. మార్చి 25న భుజాలీ మిస్సింగ్‌పై కేసు నమోదైంది. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News April 1, 2026

సైనైడ్ వాడకాన్ని నిషేధించండి: బీజేపీ

image

తుగ్గలి మండలం జొన్నగిరి, బొల్లవాని పల్లె, పగిడిరాయి గ్రామాలలో బంగారు వెలికితీతకు ఉపయోగిస్తున్న సైనైడ్ వాడకాన్ని నిషేధించాలని బీజెపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గీతామాధురి, హేమ సుందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముడి బంగారం శుద్ధి చేయడానికి ప్రాణాంతకమైన రసాయన పదార్థాలు వాడటం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రులు టీజీ భరత్, రామానాయుడుకు వినతిపత్రం అందజేశారు.

News April 1, 2026

కృష్ణా: జీఎస్టీ వసూళ్లు సక్రమంగా జరగాలి: కలెక్టర్

image

జిల్లాలో వస్తు సేవల పన్నులు(జీఎస్టీ) సక్రమంగా వసూలు అయ్యే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వాణిజ్య పన్నుల వసూళ్లపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ మంగళవారం నిర్వహించారు. జిల్లాలో వసూలవుతున్న జీఎస్టీ పన్నుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.