News April 12, 2025
మెదక్: డబ్బుల కోసం మహిళ హత్య.. నిందితుడికి రిమాండ్

నర్సాపూర్ మం. జైరాంతండాకు చెందిన మెఘావత్ భుజాలీ(52) మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. అయ్యగారిపల్లెకు చెందిన పాత నేరస్థుడు, కెథావత్ గోపాల్ డబ్బుల కోసం ఆమెను హత్య చేసినట్లు మెదక్ SP ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మద్యం తాగించి ఉరేసి హత్య చేసినట్లు చెప్పారు. మార్చి 25న భుజాలీ మిస్సింగ్‌పై కేసు నమోదైంది. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News April 19, 2025
అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు

TG: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇతర ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
News April 19, 2025
దేశంలో అత్యధికంగా వరి పంట పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ: మంత్రి

దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలన్నారు. వర్షకాలంలో 153 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 127.5 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందన్నారు. ధాన్యం కొనుగోలును కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు.
News April 19, 2025
పూసపాటిరేగ: విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం తన లాయర్లతో కలిసి శనివారం హాజరయ్యారు. సీఐ జి.రామకృష్ణ ఆమెను విచారించి పలు విషయాలు సేకరించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందన్నారు. కాగా గతంలో నెల్లిమర్ల స్టేషన్‌లో శ్రీ రెడ్డిపై కేసు నమోదయింది.