News April 12, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాకు చేరిన 35,710 పాఠ్యపుస్తకాలు

NGKL జిల్లాలోని జిల్లా పరిషత్, మండల పరిషత్, ఆదర్శ, గురుకుల, కేజీబీవీ కలుపుకొని 939 పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 72,641 విద్యార్థులున్నారు. వారికి ఆరు లక్షల వరకు పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయి. 2026-26 విద్యా సంవత్సరానికి గాను ముందస్తుగా 35,710 పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మిగతా పుస్తకాలు అందుతాయని డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు.
Similar News
News April 19, 2025
దేశంలో అత్యధికంగా వరి పంట పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ: మంత్రి

దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలన్నారు. వర్షకాలంలో 153 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 127.5 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందన్నారు. ధాన్యం కొనుగోలును కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు.
News April 19, 2025
పూసపాటిరేగ: విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం తన లాయర్లతో కలిసి శనివారం హాజరయ్యారు. సీఐ జి.రామకృష్ణ ఆమెను విచారించి పలు విషయాలు సేకరించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందన్నారు. కాగా గతంలో నెల్లిమర్ల స్టేషన్‌లో శ్రీ రెడ్డిపై కేసు నమోదయింది.
News April 19, 2025
తెనాలి: ఉద్యోగాల పేరిట కోటిన్నర వసూలు.. ఘరానా మోసగాడు అరెస్ట్

ప్రభుత్వ ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసిన కోటిన్నరకు పైగా వసూలు చేసి వ్యక్తిని త్రీటౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అమరావతి కాలనీకి చెందిన ఆరెమండ తేజ కృష్ణ కమల్ తాను ఏపీ సెక్రటేరియట్లో ఏఎస్ఓగా పని చేస్తున్నానంటూ ఫేక్ ఐడీలతో నమ్మించి ఉద్యోగాలు పేరిట భారీ మోసానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.కోటిన్నర వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు.