News April 12, 2025
సళేశ్వరం వెళ్లేవారు ప్లాస్టిక్ వాడొద్దు: నాగర్‌కర్నూల్ డీఎఫ్‌వో

సళేశ్వరం వెళ్లే భక్తులు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని నాగర్‌కర్నూల్ జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ గోపిడి సూచించారు. ATRను ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు సహకరించాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ కారణంగా వన్యప్రాణులకు హాని కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. 2 లీటర్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ వాటర్, కూల్ డ్రింక్ బాటిల్స్ నిషేధం అన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.
Similar News
News November 10, 2025
నేటి నుంచి గ్రూప్-3 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

TG: నేటి నుంచి ఈ నెల 26 వరకు HYDలోని సురవరం ప్రతాప్ రెడ్డి(పొట్టి శ్రీరాములు) యూనివర్సిటీలో గ్రూప్-3 మెరిట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. రోజూ 10:30am నుంచి 5.30pm వరకు కొనసాగనుంది. మొత్తం 1,365 పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మెరిట్ జాబితా విడుదలైంది. TGPSC <
News November 10, 2025
విశాఖ: హ్యూమన్ ట్రాఫికింగ్.. ఇద్దరి అరెస్ట్

రైలులో పసి పిల్లలను భిక్షాటన చేయించే గ్యాంగ్‌ను వాల్తేరు RPF/CPDS బృందం పట్టుకుంది. ఆపరేషన్ యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్‌లో భాగంగా చేసిన దాడిలో ఐదుగురు చిన్నారులను రక్షించి, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. సుధా కుమారి అలియాస్ శాంత, సుఖ్ బాయి ధడి చిన్నారులను ఛత్తీస్‌గఢ్ నుంచి డబ్బు ప్రలోభాలతో విశాఖకు తీసుకువచ్చినట్టు విచారణలో తెలింది. కేసు GRP/విశాఖలో నమోదు చేశారు. అనంతరం ఖరోరా PSకు బదిలీ చేశారు.
News November 10, 2025
NLG: MGUకి అరుదైన గౌరవం

MGUకి అరుదైన గౌరవం దక్కింది. ఇక్కడ జారీ చేసే వివిధ కోర్సుల సర్టిఫికెట్లకు ‘నేషనల్ అకడమిక్ డిపాజిటరీ’ స్కీమ్‌లో స్థానం లభించింది. ఇక్కడ జారీ చేసే సర్టిఫికెట్లను ఎక్కడైనా చూసుకునే అవకాశం కలుగుతుందని, దీంతో నకిలీ సర్టిఫికెట్లను ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు తమ సర్టిఫికెట్లు పొందేలా వర్సిటీ వెబ్‌సైట్‌లో డిజీలాకర్/ఎన్‌ఏడీ పోర్టల్‌ను అందుబాటులో ఉంచారు.


