News April 12, 2025
పారిశ్రామిక వృద్ధి డౌన్

ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి 6 నెలల కనిష్ఠమైన 2.9 శాతానికి పరిమితమైంది. తయారీ, గనుల తవ్వకం, విద్యుదుత్పత్తి రంగాల పేలవ పనితీరే కారణమని NSO వెల్లడించింది. గతేడాది FEBలో తయారీ వృద్ధి 4.9 శాతం ఉండగా ఈ ఏడాది అది 2.9 శాతానికి చేరింది. అలాగే మైనింగ్ 8.1% నుంచి 1.6%కి, విద్యుదుత్పత్తి 7.6% నుంచి 3.6%కి దిగివచ్చింది. అయితే మార్చి, ఏప్రిల్‌లో పరిస్థితి మెరుగుపడొచ్చని నిపుణుల అంచనా.
Similar News
News April 19, 2025
బంగ్లాదేశ్‌లో హిందు నేత హత్యను ఖండించిన భారత్

బంగ్లాదేశ్‌లో హిందూ నాయకుడు భాబేశ్ చంద్ర రాయ్ హత్య పట్ల భారత్ స్పందించింది. యూనుస్ ప్రభుత్వంలో మైనార్టీ హిందువులపై దాడులు క్రమ పద్ధతిన జరుగుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. మైనార్టీలపై దాడులు చేసిన వారిని శిక్షించలేదని ట్వీట్ చేశారు. దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు భాబేశ్‌ను కిడ్నాప్ చేసి కొట్టి చంపారు.
News April 19, 2025
లిక్కర్ స్కాం కేసు.. ఆడియో విడుదల చేసిన రాజశేఖర్ రెడ్డి

AP లిక్కర్ స్కాం కేసులో పరారీలో ఉన్న నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఓ ఆడియో విడుదల చేశారు. ‘MARలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. మా అమ్మకు నోటీసులు ఇచ్చివెళ్లారు. 24 గంటల్లోనే నేను స్పందించి ఎందుకు పిలిచారని అధికారులను అడిగా. అయినా రెండోసారి మెయిల్‌కు నోటీసులు పంపారు. దీంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. విచారణకు సహకరిస్తా’ అని చెప్పారు. ఇదే కేసులో VSR నిన్న విచారణకు హాజరయ్యారు.
News April 19, 2025
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం!

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాస్ ఏంజెలిస్‌లో జరిగే 2028 ఒలింపిక్స్‌లో స్కాట్లాండ్‌తో కలిసి బరిలోకి దిగనుందని సమాచారం. రెండు జట్లు కలిపి గ్రేట్ బ్రిటన్‌గా పాల్గొంటాయని క్రీడావర్గాలు తెలిపాయి. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ మ్యాచులకు మొదటి ఆరు ర్యాంకుల్లో ఉన్న జట్లకు ఎంట్రీ కల్పిస్తారు.