News April 12, 2025

ఆ రైతులకు ఎకరానికి రూ.10 వేలు

image

TG: అకాల వర్షాలు, ఈదురుగాలులతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర బడ్జెట్ నుంచే ఈ పరిహారం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొనగా ఈ నెలలో కురిసిన వర్షాలతో అది మరింత పెరిగింది. రైతుల వారీగా సర్వే చేయాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

Similar News

News March 21, 2026

USకు ఇరాన్ పంచ్.. 4000km దూరంలోని బేస్‌పైకి మిస్సైళ్లు

image

యుద్ధంలో ఇరాన్ దాడులు US, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఇండియానా ఓషన్‌లో ఉన్న US-UK మిలిటరీ బేస్‌ డియాగో గార్షియాపై 2 బాలిస్టిక్ మిస్సైళ్లు సంధించింది. ఇది ఇరాన్‌కు ఏకంగా 4000km దూరంలో ఉండటం గమనార్హం. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఒక మిస్సైల్ గాల్లోనే పేలిపోయిందని US తెలిపింది. మరొకదాన్ని తమ SM-3 ఇంటర్‌సెప్టర్ అడ్డుకుందని పేర్కొంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News March 21, 2026

మహిళల టీ20ల్లో సంచలనం.. అతిచిన్న వయసులో సెంచరీ

image

అంతర్జాతీయ మహిళల T20ల్లో రువాండా దేశానికి చెందిన ఫాన్నీ ఉటగుషిమనిండే చరిత్ర సృష్టించారు. అతిచిన్న వయసులో(15 ఏళ్ల 223 రోజులు) సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పారు. అంతేకాకుండా డెబ్యూ మ్యాచులోనే సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచారు. ఘనాతో జరిగిన మ్యాచులో 65 బంతుల్లో 111 రన్స్ చేసి ఆమె ఈ ఘనత సాధించారు. ఇంతకుముందు ఈ రికార్డు ఉగాండా ప్లేయర్ ప్రొస్కోవియా అలకో (16yrs 233days) పేరిట ఉండేది.

News March 21, 2026

BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,940 తగ్గి రూ.1,45,970, 22 క్యారెట్ల గోల్డ్ రూ.2,750 తగ్గి రూ.1,33,800 పలుకుతోంది. అటు వెండి కిలోపై ఏకంగా రూ.10,000 తగ్గి రూ.2,50,000కి చేరింది.