News April 12, 2025

వికారాబాద్: RYVకి అప్లై చేశారా.. 14 వరకే ఛాన్స్

image

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్‌ యువ వికాసం స్కీం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శుక్రవారం వరకు వికారాబాద్ జిల్లాలో సుమారుగా 12 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 14 వరకు అవకాశం ఉంది. RYV మంచి అవకాశమని, దీన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు పేర్కొన్నారు.

Similar News

News March 5, 2026

చాట్ GPTకి షాక్.. 25 లక్షల మంది యూజర్లు ఔట్!

image

చాట్ GPTకి యూజర్లు షాకిచ్చారు. 25 లక్షల మంది దాన్ని బాయ్‌కాట్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ శాఖలో ఏఐ మోడల్స్ వినియోగానికి OpenAI ఒప్పందం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మిలిటరీ ఆపరేషన్లలో AI వినియోగానికి మద్దతు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్లు రద్దు చేసుకుంటున్నారు. బాయ్‌కాట్ చేస్తామని వెబ్‌సైట్‌(https://quitgpt.org/)లో సంతకాలు చేస్తున్నారు.

News March 5, 2026

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు శాశ్వత నివాసాలు కల్పించడం లక్ష్యమని తెలిపారు. పనులు వేగంగా పూర్తి చేసి నాణ్యతలో రాజీ పడకూడదన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని, బిల్లులు, సామగ్రి సరఫరా, సాంకేతిక పర్యవేక్షణపై అధికారులకు సూచనలు చేశారు.

News March 5, 2026

సిద్దిపేట: జాతీయ చేనేత అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ చేనేత అవార్డ్స్-2026 కొరకు చేనేత కళాకారులు, డిజైనర్ వృత్తిలో నైపుణ్యం కలిగిన కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం.సాగర్ పేర్కొన్నారు.అర్హులైన చేనేత నిపుణులు ఈనెల 23 వరకు సిద్ధిపేట చేనేత జౌళి శాఖ కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు తోపాటు వారు తయారు చేసిన వస్త్రములు సమర్పించాలని కోరారు. సదరు వస్త్రం తానే స్వయంగా మగ్గంపై తయారు చేయాలన్నారు.