News March 27, 2024
ఎచ్చెర్ల సీటు ఎవరి కోసమో..?

ఎచ్చెర్ల కూటమి సీటు ఇంకా కేటాయించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. 2014లో YCP అభ్యర్థి జి.కిరణ్ కుమార్‌పై,TDP అభ్యర్థి కళావెంకట్రావు గెలుపొందారు. 2019లో కూడా వీరే ప్రత్యర్థులుగా ఉండగా ఈసారి TDPపైYCP జెండా ఎగిరింది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు YCP నుంచి గొర్ల కిరణ్ కుమార్‌ను అధిష్ఠానం బరిలో దింపింది. మరి కూటమి నుంచి ఎవరు పోటీ ఇస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News March 14, 2026
ధాన్యం కొనుగోలుకు ఈనెల 28 లాస్ట్ డేట్: జేసీ

ప్రభుత్వ పరంగా రైతులు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఈనెల 28 ఆఖరి తేదీ అని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం అమ్మాలనుకున్న రైతులు మీ ప్రాంతాల్లో గల రైతు సేవ కేంద్రాల్లో గల సిబ్బందిని లేదా మండల వ్యవసాయ శాఖ అధికారిని పైన తెలిపిన తేదీలోగా సంప్రదించాలని ఆయన తెలిపారు.

News March 13, 2026
16 నుంచి ఒంటిపూట బడులు: డీఈఓ

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 16వ తేదీ సోమవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఆదేశాలు జారీచేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యాన్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్ష కేంద్రాల పాఠశాలల్లో మధ్యాన్నం 1 నుంచి 4 గంటల వరకు తరగతులు ఉంటాయని పేర్కొన్నారు.