News April 12, 2025
నేరడిగొండలో 52 మందికి TB పాజిటివ్

నేరడిగొండ మండలంలో నెల క్రితం పీహెచ్సీ వైద్యుల ఆధ్వర్యంలో టీబీ పరీక్షలు నిర్వహించారు. వారిలో మొత్తం 52 మందికి టీబీ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు శుక్రవారం హెచ్ఈఓ పవార్ రవీందర్ వెల్లడించారు. శుక్రవారం 25 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. టీబీ బాధితులకు 6 నెలల వైద్యంతో పాటు నెలకు రూ.1000, పోషణ న్యూట్రిషన్ కిట్ ఇవ్వనున్నామన్నారు. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్, సంతోష్, తదితరులున్నారు.
Similar News
News April 14, 2025
కోటపల్లి: నవదంపతుల సూసైడ్

పెళ్లైన 6 నెలలకే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటపల్లి (M) దేవులవాడకు చెందిన సృజన(30) లక్షెట్టిపేటలో డిగ్రీ చదువుతోంది. కులాలు వేరే కావడంతో పెద్దలను ఎదురించి సీనియర్ విష్ణువర్ధన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ మార్చి 24న గోదావరిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన సృజన ఇంట్లోనే ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుబుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News April 14, 2025
ఆదిలాబాద్: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
News April 14, 2025
అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయండి: ADB కలెక్టర్

ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఫైర్ ఆఫీసర్ జైత్రాం, యస్దాని, సంగాన్న, తదితరులు ఉన్నారు.