News April 12, 2025

తెలంగాణలో టాప్‌ 3లో ఉమ్మడి ADB

image

భద్రాచలం శ్రీ రాములవారి తలంబ్రాల పంపిణీని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం ప్రణీత్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని ఆర్ఎం కార్యాలయంలో పలువురికి తలంబ్రాలను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,350 మంది బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. తలంబ్రాల బుకింగ్‌లో రాష్ట్రంలో ఆదిలాబాద్ రీజియన్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News September 13, 2025

కర్నూలు జిల్లా కలెక్టర్‌గా సిరి బాధ్యతల స్వీకరణ

image

కర్నూలు జిల్లా నూతన కలెక్టర్‌గా అట్టాడ సిరి ఇవాళ ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ ఛాంబర్‌లో ఉదయం 10.40 గంటలకు మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేసి, ఆమెను ఆశీర్వదించారు. పలువురు జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ లబ్ధిదారుడికి చేరేలా కృషి చేద్దామన్నారు.

News September 13, 2025

భీమవరం: సోమేశ్వర జనార్ధన స్వామిని తాకిన సూర్య కిరణాలు

image

భీమవరం గునుపూడిలో కొలువైన శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారిని శనివారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. సూర్యోదయ సమయంలో ఈ అద్భుత దృశ్యం కనిపించిందని ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారని ఆయన చెప్పారు.

News September 13, 2025

మెదక్ జిల్లా కోర్టులో లోక్ అదాలత్

image

మెదక్ జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ నీలిమ సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ ఎం.శుభవల్లి పర్యవేక్షించారు. రాజీ మార్గమే రాజమర్గమన్నారు. ఈ సందర్బంగా పలువురు తమ కేసుల్లో రాజీ పడ్డారు. న్యాయమూర్తులు సిరి సౌజన్య, సాయి ప్రభాకర్, స్వాతి, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.