News April 12, 2025
రాజమండ్రి సెంట్రల్ జైలుకు గోరంట్ల మాధవ్

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడి చేసిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. మాధవ్‌తో పాటు మరో ఆరుగురిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మాధవ్ అతనిపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే.
Similar News
News March 19, 2026
అనంత: రూ.1.30 కోట్లకు పైగా పంట నష్టం

అనంతపురం జిల్లాలో ఈదురుగాలుల తాకిడికి ఉద్యాన, వ్యవసాయ పంటలు చెల్లాచెదురైన పరిస్థితి నెలకొంది. కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు, ఆత్మకూరు, గార్లదిన్నె, శింగనమల తదితర మండలాలలో 65 ఎకరాలలో అరటి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. రూ.1.30 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. వరి, మొక్కజొన్నతో పాటు ఇతర ఉద్యాన పంటల నష్టం వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
News March 19, 2026
ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం: కలెక్టర్

నూతన సంవత్సరాది ఉగాది పండుగను తెలుగు సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అనంతపురం కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ గురువారం ఉగాది పండుగను జిల్లా సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు పరాభవ నామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
News March 19, 2026
ఉగాదిని సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి: ఎస్పీ

జిల్లా ఎస్పీ జగదీశ్ ప్రజలకు ఉగాది రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన తెలుగు సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎస్పీ ఆకాంక్షించారు. జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ఉగాదిని సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. సేవా దృక్పథంతో, ఆధ్యాత్మిక చింతనతో పండుగలను జరుపుకోవాలని సూచించారు.


