News April 12, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి దేవస్థానంలో చైత్ర మాసం పౌర్ణమి తిధి శనివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
Similar News
News April 16, 2026
ఇంటి నుంచి వివరాలు నమోదు చేసుకోండి: JC

దేశంలో తొలిసారిగా డిజిటల్ జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ఈ నెల 16 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు
NTR JC ఎస్.ఇలక్కియ తెలిపారు. ప్రజలు https://se.census.gov.in� పోర్టల్ ద్వారా తమ ఇంటి నుంచే వివరాలు నమోదు చేయాలని కోరారు. ఈ విధానం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు ఖచ్చితమైన డేటా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వీయ గణనలో పాల్గొని జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.
News April 16, 2026
వీళ్లూ ITR ఫైల్ చేయాల్సిందే!

ITR ఫైల్ చేయడం ఆదాయంపైనే ఆధారపడి ఉండదు. కొన్ని రకాల ఖర్చులు లేదా లావాదేవీలు పరిమితి దాటితే తప్పనిసరి. *సేవింగ్స్ అకౌంట్‌లో ₹50 లక్షలు, కరెంట్ అకౌంట్‌లో ₹కోటి డిపాజిట్ చేస్తే. *ఏడాదికి కరెంటు బిల్లు ₹లక్ష దాటితే. *బిజినెస్ టర్నోవర్ ₹60 లక్షలు దాటితే. *ప్రొఫెషనల్ ఇన్కమ్ ₹10 లక్షల పైన ఉంటే. *TDS లేదా TCS రూపంలో ₹25 వేలు అంతకంటే ఎక్కువ కట్ అయితే ఆదాయం పన్ను పరిమితిలో లేకపోయినా ITR ఫైలింగ్ తప్పనిసరి.
News April 16, 2026
వనపర్తి: 3,897 మంది రైతులకు రూ.30.02 కోట్ల రుణమాఫీ

గోపాల్ పేట మండలంలో 3,897 మంది రైతులకు గాను మొత్తం రూ.30.02 కోట్ల రుణమాఫీ చేసినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. అదేవిధంగా 12,637 మంది రైతులకు గాను 23,275 ఎకరాలకు రూ.13.96 కోట్ల పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను అందించామన్నారు. మండలంలో మొత్తం 10,534 రేషన్ కార్డులు ఉండగా.. వాటిలో కొత్తగా 962 రేషన్ కార్డులు జారీ చేసినట్లు ఆయన వివరించారు.


