News April 12, 2025

జమ్మిచేడు జమ్ములమ్మకు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక దర్శనం

image

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జమ్మిచేడులో వెలిసిన జమ్ములమ్మకు శనివారం పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జమ్ములమ్మను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Similar News

News January 14, 2026

రేపు, ఎల్లుండి విజయ్‌ హజారే ట్రోఫీ సెమీఫైనల్స్

image

విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్‌, విదర్భ, కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. నిన్నటి క్వార్టర్‌ఫైనల్లో పంజాబ్‌ 183 పరుగుల తేడాతో MPపై ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో విదర్భ 76 పరుగులతో ఢిల్లీని ఓడించింది. దీంతో రేపు జరిగే సెమీఫైనల్లో విదర్భ-కర్ణాటక తలపడనుండగా, ఎల్లుండి పంజాబ్‌-సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమ్‌లు 18న ఫైనల్లో తలపడనున్నాయి.

News January 14, 2026

20న పోలీస్ కమిషనరేట్‌లో కైట్ ఫెస్టివల్

image

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ నెల 20న భారీ కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ‘అరైవ్ అలైవ్’ (#ArriveAlive) ప్రచారంలో భాగంగా ఈ వేడుకను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గాలిపటాలు ఎగురవేస్తూనే ప్రయాణ భద్రతపై అవగాహన పెంచుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆకాశంలో గాలిపటంలాగే మన ప్రయాణం కూడా సురక్షితంగా సాగాలని అధికారులు ఆకాంక్షించారు.

News January 14, 2026

ADB: చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

image

చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్‌లోని నేషనల్ మార్ట్ సమీపంలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.