News April 12, 2025

కరీంనగర్: ఉద్యోగం పేరుతో మోసం.. కేసు నమోదు

image

విదేశాలలో ఉద్యోగం పేరుతో యువకుడిని మోసంచేసిన వ్యక్తిపై కేసునమోదుచేసినట్లు 2టౌన్ సీఐ సృజన్‌రెడ్డి తెలిపారు. KNRభగత్‌నగర్‌కు చెందిన మెహర్‌తేజను HYDకు చెందిన ప్రశాంతరాథోడ్ బ్యాంకాక్‌లో బిజినెస్ ప్రాసెస్ ఉద్యోగం ఇప్పిస్తానని కొంత డబ్బుతీసుకొని బ్యాంకాక్ పంపించాడు. అక్కడ మోసపూరిత సంస్థలో చేర్పించి పాస్పోర్ట్ తీసుకొని నిర్బంధించారని, అక్కడి పోలీసుల సహాయంతో వచ్చానని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడన్నారు.

Similar News

News July 4, 2025

లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: కలెక్టర్

image

లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆఫీసులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం చేపట్టాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.‌ ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలన్నారు.

News July 4, 2025

నాటుసారా నిర్మూల‌న‌తో స‌మాజానికి న‌వోద‌యం: కలెక్టర్

image

ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లిగించి రాష్ట్రంలో నాటు సారాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం న‌వోద‌యం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింద‌ని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను అయన సంద‌ర్శించారు. జిల్లాలో ‌మొదటి ద‌శ న‌వోద‌యం సత్ఫలితాలు ఇచ్చింద‌న్నారు. ఇదే స్ఫూర్తితో న‌వోద‌యం 2.0ను ప్రారంభించామని చెప్పారు.

News July 4, 2025

నిధులు ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదు: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో CSR నిధులు ఉన్నప్పటికీ మైక్రో వాటర్ ఫిల్టర్‌ల నిర్మాణంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని RWS అధికారులను కలెక్టర్ బాలాజీ ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో గ్రామీణ నీటి సరఫరా ఫిల్టర్‌లు, అంగన్వాడీ కేంద్రాల్లో వర్షపు నీటి నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. గ్రామాల్లో మైక్రో వాటర్ ఫిల్టర్‌లను నిర్మించడంలో RWS ఇంజినీర్‌లు శ్రద్ద చూపడం లేదని కలెక్టర్ అన్నారు.