News April 12, 2025
పెద్దపల్లి: బాలికపై యువకుడి అత్యాచారయత్నం.. అరెస్టు

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సనత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నవదీప్ (22) గురువారం మధ్యాహ్నం అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధిత తల్లి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచారు.
Similar News
News March 22, 2026
నేడే రైతు భరోసా నిధుల విడుదల

TG: రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. తొలి విడతలో ఒక ఎకరం భూమి వరకు రూ.6,000 చొప్పున మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ₹3,590 కోట్లు చేరనున్నాయి. మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా ₹2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులు జమ కానున్నాయి.
News March 22, 2026
ఒడిశాలో నంద్యాల జిల్లా వాసి సత్తా

భువనేశ్వర్(ఒడిశా)లో ఈనెల 18 నుంచి జరుగుతున్న 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నంద్యాల(D) రుద్రవరం గ్రామానికి చెందిన గౌతమ్ రజత పతకం సాధించారు. ఈ మేరకు జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి రమణయ్య తెలిపారు. F-41 కేటగిరీ షాట్ పుట్‌లో రజత పతకం సాధించడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని వారన్నారు. జిల్లాలోని ప్రముఖులు గౌతమ్‌కు అభినందనలు తెలిపారు.
News March 22, 2026
నంద్యాల: పొంచి ఉన్న ప్రమాదం!

నంద్యాల జిల్లాలో పలు బ్రిడ్జిలు, కల్వర్టుల రక్షణ గోడులు శిథిలావస్థకు చేసుకొని ప్రమాదకరంగా మారాయి. వెలుగోడు మండలం రేగడగూడూరుకు వెళ్లే రహదారిలో అబ్దుల్లాపురం సమీపాన ఉన్న వంకపై ఏర్పాటు చేసిన కల్వర్టుకు సైడ్ వాల్ లేకపోవడంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో ఆదమరిస్తే వాహనదారులు ప్రమాదాలకు గురవ్వాల్సిందే. అధికారులు స్పందించి కల్వర్టుపై సైడ్ వాల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


