News March 27, 2024
జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఆదిలాబాద్ యువకుడు

నేరడిగొండ మండలం మర్లపల్లికి చెందిన జాదవ్ కిరణ్ జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల రామాయంపేటలో జరిగిన రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో అండర్ 18 విభాగంలో చక్కని ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని సాధించారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు హరియాణాలోని పంచకులలో నిర్వహించే జాతీయస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్
పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు.
Similar News
News April 1, 2026
ఆదిలాబాద్: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

ఆదిలాబాద్: జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ జీవిత బీమా’ ప్రారంభం

ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని జూన్ 2న ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. మార్చిలో చేపట్టిన పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, పారిశుద్ధ్య కార్యక్రమాల తరహాలోనే, ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.