News April 12, 2025

పృథ్వీషాను తీసుకోండి.. CSK ఫ్యాన్స్ డిమాండ్

image

వరుస ఓటములు ఎదురవుతుండటంతో CSK అభిమానులు నిరాశలో ఉన్నారు. పవర్ ప్లే‌లో హిట్టింగ్ చేసే బ్యాటర్ లేకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు. గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన రుతురాజ్ స్థానంలో పృథ్వీషాను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ పేరు Xలో ట్రెండ్ అవుతోంది. కాగా పృథ్వీ షా, ఆయుశ్ మాత్రే, మయాంక్ అగర్వాల్‌లో ఒకరిని జట్టులోకి తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి.

Similar News

News September 16, 2025

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

image

TG: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య‌పై ఎఫ్ఐఆర్‌ను 2016లో హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ దీనిపై CJI జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 22న తదుపరి విచారణ చేస్తామని వెల్లడించింది.

News September 16, 2025

పంట దిగుబడిని పెంచే నానో ఎరువులు

image

వ్యవసాయంలో చాలా కాలంగా రైతులు సంప్రదాయ యూరియా, DAPలను ఘన రూపంలో వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూపంలో నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని సూచించిన పరిమాణంలో నీటితో కలిపి పిచికారీ చేస్తే.. ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90 శాతం గ్రహిస్తాయి. దీని వల్ల ఎరువు నష్టం తగ్గి దిగుబడులు పెరుగుతాయని IFFCO చెబుతోంది.

News September 16, 2025

నానో ఎరువులను ఎలా వాడాలి?

image

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్‌‌లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.