News April 12, 2025
HYD: NRSCతో హైడ్రా ఒప్పందం

NRSCతో హైడ్రా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉపగ్రహ చిత్రాలు, ఇతరాత్ర భూ వివరాలను ఉపయోగించుకొని చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం తదితర వాటికోసం NRSCతో MOU కుదుర్చుకుంది. ఈ మేరకు శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాలు చేశారు.
Similar News
News July 9, 2025
NLG: తాడిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

కేతేపల్లి మండలం చీకటిగూడెంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు జానయ్య ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుంచి పడ్డాడు. ఈ క్రమంలో మోకు మెడకు చుట్టుకోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. జానయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిది పేద కుటుంబమని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. మృతదేహాన్ని నకిరేకల్ మార్చురీకి తరలించారు.
News July 9, 2025
జనసేనలోకి చేరిన నలుగురు జడ్పీటీసీలు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నలుగురు జెడ్పీటీసీలు వైసీపీ నుంచి జనసేన పార్టీలో బుధవారం చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారందరికీ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జంగారెడ్డిగూడెం నుంచి బాబ్జీ , ఆంజనేయులు(తాడేపల్లిగూడెం), అడ్డాల జానకి(అత్తిలి), కొమ్మిశెట్టి రజనీ(పెరవలి) ఉన్నారు.
News July 9, 2025
మంగళగిరి: జనసేనలో చేరిన ఆర్య వైశ్య ప్రముఖులు

జనసేన పార్టీలోకి ఆర్యవైశ్య ప్రముఖులు చేరారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చార్టెడ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు, వైశ్యసత్ర సముదాయం అధ్యక్షుడు దేవకీ వెంకటేశ్వర్లు, శ్రీకాశీ అన్నపూర్ణ చౌల్ట్రీస్ అధ్యక్షుడు భవనాసి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ వారికి సాదరంగా స్వాగతం పలికారు.