News April 12, 2025

సిరిసిల్ల జిల్లాలో భానుడు భగభగ

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. సిరిసిల్ల 41.4 °c,రుద్రంగి 41.3 °c, ఇల్లంతకుంట 41.2 °c,వీర్నపల్లి 41.1°c, గంభీరావుపేట 40.9 °c,వేములవాడ రూరల్ 40.9°c, కోనరావుపేట 40.4 °c,ఎల్లారెడ్డిపేట 40.2 °c,బోయిన్పల్లి 40.1°c,ముస్తాబాద్ 39.9 °c, లుగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతవరణశాఖ ఆరెంజ్ జోన్ ప్రకటించింది.

Similar News

News March 17, 2026

వికారాబాద్: మత్తు ఇచ్చి భార్యభర్తల దోపిడి

image

వైద్యురాలిగా నటిస్తూ రోగులకు మత్తుమందు ఇచ్చి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న దంపతులను సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్, మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గౌండ్ల శిరీష, భర్త సాయి కుమార్ గౌడ్ వికారాబాద్ జిల్లా వాసులు. శిరీష ఫార్మ్-డి విద్యార్థిని కావడంతో వైద్య పరిజ్ఞానంతో కార్పోరేట్ ఆస్పత్రుల్లో వృద్ధ రోగులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. 11 తులాల బంగారం, కారు, ఫోన్లు సీజ్ చేశారు.

News March 17, 2026

పాలమూరు: రైతులు ALERT.. అప్లై చేసుకోండి

image

‘రైతు భరోసా’ కొత్త దరఖాస్తులు, బ్యాంక్ వివరాల అప్డేట్ కోసం రైతులు ఈనెల 25లోగా దరఖాస్తులు చేసుకోవాలని పెద్దవార్వాల్ ఏఈఓ శివలీల ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఆధార్, పట్టాదార్ పాస్ బుక్ (28/02/2026 వరకు వచ్చిన కొత్త పట్టా), బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ నంబర్, రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలన్నారు. అర్హత గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. SHARE IT

News March 17, 2026

‘లంచ్ బాక్స్ తెచ్చుకోండి’.. IT ఉద్యోగులకు గ్యాస్ కష్టాలు

image

దేశంలో నెలకొన్న LPG కొరత IT ఉద్యోగులను కష్టాలకు గురిచేస్తోంది. ఇన్ఫోసిస్, TCS, విప్రో, కాగ్నిజెంట్ వంటి సంస్థలు తమ క్యాంటీన్ సేవలను తగ్గించాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఫుడ్ కౌంటర్లను మూసివేసి కేవలం లిమిటెడ్ మెనూని మాత్రమే అందిస్తున్నాయి. ఉద్యోగులు తమ భోజనాన్ని ఇళ్ల నుంచే తెచ్చుకోవాలని కంపెనీలు సూచించాయి. హాస్టళ్లు, PGల్లో ఉంటూ క్యాంటీన్ ఫుడ్‌పై ఆధారపడే టెకీలకు ఇది పెద్ద సమస్యగా మారింది.