News April 12, 2025
సిరిసిల్ల జిల్లాలో భానుడు భగభగ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. సిరిసిల్ల 41.4 °c,రుద్రంగి 41.3 °c, ఇల్లంతకుంట 41.2 °c,వీర్నపల్లి 41.1°c, గంభీరావుపేట 40.9 °c,వేములవాడ రూరల్ 40.9°c, కోనరావుపేట 40.4 °c,ఎల్లారెడ్డిపేట 40.2 °c,బోయిన్పల్లి 40.1°c,ముస్తాబాద్ 39.9 °c, లుగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతవరణశాఖ ఆరెంజ్ జోన్ ప్రకటించింది.
Similar News
News September 15, 2025
‘అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి’

సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఇన్‌ఛార్జి సంయుక్త కలెక్టర్ గంగాధర్ గౌడ్ సోమవారం అన్నారు. స్వస్తి నారి శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
News September 15, 2025
ఉదయగిరి: ఏటీఎం మార్చి నగదు కాజేసిన కేటుగాడు

ఉదయగిరిలో ఏటీఎం కార్డు మార్చి నగదు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 8వ తేదీన సినిమా హాల్ వీధికి చెందిన ఓ మహిళ తన ఖాతాలో ఉన్న డబ్బులను డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్‌కి వచ్చింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని కోరింది. దీంతో ఆ వ్యక్తి కొంత డబ్బులు డ్రా చేసి ఆమెకు సంబంధించిన ఏటీఎం కార్డు ఇవ్వకుండా వేరే కార్డు మార్చి అందులోని రూ.8 వేలు నగదును ఆ కేటుగాడు కాజేశారు.
News September 15, 2025
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న గీతాంజలి శర్మను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపిన ఆమె పనితీరు ప్రశంసలు పొందింది. ఇకపై ఫైబర్ నెట్ విస్తరణలో కీలక పాత్ర పోషించనున్నారు. కొత్త జాయింట్ కలెక్టర్‌పై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.