News April 12, 2025

ఘోర విషాదం.. 10 మంది మృతి

image

APలో తీవ్ర విషాదం నెలకొంది. 3 ప్రాంతాల్లో జరిగిన ఘోర ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ అన్నమయ్య(D) మైలపల్లి రాచపల్లిలో నీటి కుంటలో పడి ఏడేళ్ల వయసున్న ముగ్గురు బాలురు మరణించారు. తూర్పుగోదావరి(D) కోరుకొండలో విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. నిన్న అనంతపురం(D) కుందుర్చిలో బొగ్గుల బట్టీ కోసం జేసీబీతో తీస్తున్న మట్టి పడి అక్కడే ఆడుకుంటున్న నలుగురు పిల్లలు చనిపోయారు.

Similar News

News March 24, 2026

మీ దగ్గర ₹713 ఉన్నాయా? అయితే మీరు ఇరాన్‌లో కోటీశ్వరులే!

image

ఇరాన్ కరెన్సీ ‘రియాల్’ విలువ దారుణంగా పడిపోవడంతో సామాన్యుల జీవితం అతలాకుతలమవుతోంది. మన దగ్గర కేవలం ₹713 ఉంటే అక్కడ కోటి రూపాయలతో సమానం. అదే డాలర్‌తో పోల్చితే $7.60 మాత్రమే. వినడానికి జోక్‌గా అనిపించినా అక్కడి తీవ్ర ద్రవ్యోల్బణానికి ఇది నిదర్శనం. యుద్ధ భయాలు, అంతర్జాతీయ ఆంక్షల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది.

News March 24, 2026

‘కురు వృద్ధులు’ అని ఎవరిని అంటారు?

image

రాజకీయాలు, ఇతర రంగాలలో చాలా అనుభవం ఉన్న వ్యక్తులను గౌరవించడానికి ‘కురు వృద్ధులు’గా పిలుస్తున్నారు. మహాభారతంలోని కురువంశంలో ప్రముఖులు, వయసుమీరిన వారిని ప్రస్తావించేటప్పుడు ఈ పదాన్ని ఎక్కువగా వాడతారు. ముఖ్యంగా భీష్ముడు, ధృతరాష్ట్రుడిని కురు వృద్ధులుగా సంబోధిస్తారు. కాలక్రమంలో ఇదొక జాతీయమైంది. పాలిటిక్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఉదా. రాజకీయ కురు వృద్ధుడు అద్వాణీ.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 24, 2026

ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచేసిన స్విగ్గీ.. నెటిజన్ల అసహనం!

image

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ ప్లాట్‌ఫామ్ ఫీజులు పెంచడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత వారం జొమాటో ₹13.50గా ఉన్న ఫీజును ₹14,90 చేసింది. తాజాగా స్విగ్గీ ₹14.99 నుంచి ₹17.58కి పెంచింది. చమురు ధరలు పెరగడం, ఇంధన కొరతే పెంపునకు కారణంగా తెలుస్తుండగా దీనిపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల జేబులకు చిల్లులు పెట్టేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయని అంటున్నారు.