News April 12, 2025
ఆ 400 ఎకరాల తాకట్టులో దాగిన చీకటి కోణం ఏంటి?: హరీశ్ రావు

TG: గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తనఖా పెట్టి రుణం తీసుకున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిందని BRS MLA హరీశ్ రావు తెలిపారు. తాము తాకట్టు పెట్టుకోలేదని ICICI బ్యాంక్ చెబుతోందని, మరి GOVT ఎక్కడ తాకట్టు పెట్టిందని ప్రశ్నించారు. CM రేవంత్ తన బ్రోకర్ కంపెనీల వద్ద తనఖా పెట్టారా? అని నిలదీశారు. ఆ భూముల విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏంటో చెప్పాలన్నారు. ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News March 30, 2026
బంగ్లాదేశ్‌లో IPL టెలికాస్ట్ లేనట్లే

బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ మ్యాచుల ప్రసారం జరిగే అవకాశం లేదు. ఇటీవల ఆ దేశ ప్రభుత్వం మ్యాచుల ప్రసారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ బ్రాడ్‌కాస్ట్ అగ్రిమెంట్‌ను జియో స్టార్ తాజాగా రద్దు చేసుకుంది. 2023-2027 వరకు ప్రసార హక్కులను తీసుకున్న బంగ్లా ఛానల్ ‘టీ స్పోర్ట్స్’ గడువులోగా పేమెంట్స్ చేయలేదు. దీంతో జియో స్టార్ ఒప్పందాన్ని రద్దు చేసింది. WPLకూ ఇది వర్తించనుంది.
News March 30, 2026
KCRను గృహ నిర్బంధం చేశారని నా అనుమానం: CM రేవంత్

TG: రావణుడి వల్లే రాముడి గొప్పతనం తెలిసిందని, కేసీఆర్ ఉండటం వల్లే తనకు గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్ చెప్పారు. ఆయన లేకపోతే తాను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేవి కాదని మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారని, కానీ తన అనుమానం ప్రకారం ఆయనను గృహ నిర్బంధం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
News March 30, 2026
‘తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండి’ అర్థమిదే

గురజాడ రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం నుంచి ఈ నానుడి వాడుకలోకి వచ్చింది. ఆ నాటకంలో అగ్నిహోత్రావధాన్లు తన 8ఏళ్ల కూతురిని 60 ఏళ్ల ముసలాడితో పెళ్లి చేయాలనుకుంటాడు. ఇంట్లో ఆడవారికి చెప్పకుండా వీధి అరుగు మీద నిశ్చయ తాంబూలం ఇచ్చేసి ఈ మాట అంటాడు. ముఖ్యమైన పని చేశాక/ఆదేశాలు ఇచ్చాక ఏం జరిగినా తన నిర్ణయం మారదని చెప్పే సందర్భంలో ఈ నానుడిని వాడుతున్నాం.
<<-se>>#EPICSAYINGS<<>>


