News April 12, 2025

కడప జిల్లాకు 21వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో కడప జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 15301 మంది పరీక్షలు రాయగా.. 9295 మంది పాసయ్యారు. 61 శాతం పాస్ పర్సంటేజీతో కడప జిల్లా రాష్ట్రంలోనే 21వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 12878 మందికి, 9688 మంది పాసయ్యారు. 75 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 22వ స్థానంలో కడప జిల్లా నిలిచింది.

Similar News

News March 24, 2026

రేపు ఒంటిమిట్టలో పసుపు దంచే కార్యక్రమం

image

ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఆలయంలో పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. దేనితో కళ్యాణ ఘట్టానికి ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉద‌యం గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోళ్ళు, రోకళ్లను స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం పసుపును ఆలయంలో దంచుతారు. ఈ పసుపును స్వామివారి ముత్యాల తలంబ్రాలకు వినియోగిస్తారు.

News March 24, 2026

నియోజకవర్గాల పునర్విభజనపై ఎవరి లెక్కలు వారివే.!

image

కడప జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. భౌగోళిక, జనాభా, ఓటర్ల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగొచ్చని చర్చ సాగుతోంది. దీనిపై రాజకీయ నాయకులు, అనుచరులు, ప్రజలు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కలు తీస్తున్నారు. కడప-2,84,548, ప్రొద్దుటూరు-2,48,324, జమ్మలమడుగు-2,42,749, పులివెందుల-2,30,235, బద్వేల్-2,20,804, మైదుకూరు-2,12,380, కమలాపురం-2,05,019 ఓటర్లు ఉన్నారు.

News March 24, 2026

కడప: కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవేనా?

image

ఉమ్మడి కడప జిల్లాలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై జోరుగా చర్చ నడుస్తోంది. భౌగోళిక, జనాభా ప్రాతిపదికన కడప రూరల్, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే బ్రహ్మంగారిమఠం, పోరుమామిళ్లలో ఒకటి. ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉండటం, రైల్వే, రోడ్డు మార్గాలు ఉండటంతో ఎర్రగుంట్ల కూడా నియోజకవర్గం అయ్యే అవకాశం ఉంది. ఇక నందలూరు పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఏవి నియోజకవర్గాలు అవుతాయో చూడాలి.