News April 12, 2025
కాకినాడ జిల్లాకు 20వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో కాకినాడ జిల్లా విద్యార్థులు నిరాశ పరిచారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 17,326 మంది పరీక్షలు రాయగా 13,582 మంది పాసయ్యారు. 78 శాతం పాస్ పర్సంటేజీతో కాకినాడ జిల్లా రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 20,398 మందికి 12,920 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 15వ స్థానంలో కాకినాడ జిల్లా నిలిచింది.
Similar News
News October 29, 2025
సిద్దిపేట: హరీశ్‌రావుని పరామర్శించిన ఏపీ మాజీ మంత్రి

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మరణించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడుదల రజిని మంగళవారం హరీశ్‌రావు నివాసానికి వెళ్లారు. ఆయనను పరామర్శించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు కూడా X వేదికగా సంతాపం తెలిపారు.
News October 29, 2025
15వేల విద్యుత్ స్తంభాలు సిద్ధం: సీఎండీ

విశాఖ ఏపీఈపీడీసీఎల్ పరిధిలో గల 11 జిల్లాల్లో 15 వేల విద్యుత్ స్తంభాలు, 950 ట్రాన్స్ఫార్మర్లు, 80 జేసీబీలు, 115 క్రేన్లు, 254 డ్రిల్లింగ్ యంత్రాలు సిద్ధం చేసినట్లు సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పునరుద్ధరణ చర్యలు పూర్తయ్యే వరకు ఉద్యోగుల సెలవులను రద్దు చేశామన్నారు.
News October 29, 2025
సంగారెడ్డి: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ

సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో 30 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని డైరెక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 19 నుంచి 45 వయసు గల పురుష అభ్యర్థులు అర్హులు. 10 క్లాస్ పాసై, తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. శిక్షణ సమయంలో వసతి భోజనం ఉచితంగా ఇస్తామన్నారు.


