News April 12, 2025

శ్రీకాకుళం జిల్లాకు 23వ స్థానం

image

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 16,926 మంది పరీక్షలు రాయగా 12,532 మంది పాసయ్యారు. 74 శాతం పాస్ పర్సంటేజీతో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే 23 వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 18,574 మందికి 11,733 మంది పాసయ్యారు. 63శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 18వ స్థానంలో శ్రీకాకుళం జిల్లా నిలిచింది.

Similar News

News April 13, 2025

బూర్జ: రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన విద్యార్థిని 

image

బూర్జ మండలం ఓవిపేట మోడల్ స్కూల్‌‌లోఎంపీసీ గ్రూపు సెకండ్ ఇయర్ చదువుతున్న కె.ధరణి శనివారం విడుదలైన ఫలితాల్లో మంచి మార్కులు సాధించింది. 1000కి 984 మార్కులు రావడంతో ఇంటర్మీడియట్ కార్యదర్శి విద్యార్థినిని సైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డును 15న సీఎం చేతులు మీదుగా విజయవాడలో అందుకుంటారని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బి. శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 

News April 13, 2025

SKLM: ఆదిత్యుని నేటి ఆదాయం

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.2,67,800/- లు,పూజలు, విరాళాల రూపంలో రూ.78,417/-లు, ప్రసాదాల రూపంలో రూ.1,76,405లు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని చెప్పారు.

News April 13, 2025

మందస : పరీక్ష రోజు తండ్రి మృతి.. 483 మార్కులతో సత్తా 

image

తన తండ్రి మరణాన్ని దిగమింగుకుని పరీక్ష రాసిన విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ సీఈసీలో 483/500 మార్కులు సాధించింది. మందస గ్రామానికి చెందిన శివాని తండ్రి పండా పరీక్ష రోజు గుండెపోటుతో మరణించారు. పుట్టెడు దు:ఖంలోనూ పరీక్షలు రాసింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకబడకుండా పరీక్షలలో సత్తా చాటడంతో అధ్యాపకులు,కుటుంబీకులు అభినందనలు తెలిపారు.

error: Content is protected !!