News April 12, 2025
ఇంటర్ రిజల్ట్స్.. 12 వ స్థానంలో విజయనగరం జిల్లా

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో విజయనగరం జిల్లాలో 17,636 మందికి 11,525 మంది పాసయ్యారు. 65 శాతం పాస్ పర్సంటేజీతో ఫస్ట్ ఇయర్‌లో రాష్ట్రంలో 12వ స్థానంలో జిల్లా నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 15,512 మంది పరీక్షలు రాయగా 12,340 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలో విజయనగరం జిల్లా 15వ స్థానంలో నిలిచింది.
Similar News
News April 13, 2025
రేగిడి: చెట్టును ఢీకొన్న టిప్పర్.. డ్రైవర్ దుర్మరణం

ఇసుక లోడింగ్ కోసం వెళ్తున్న టిప్పర్ రేగిడి (M) రెడ్డి పేట సెంటర్ వద్ద ఆదివారం ఉదయం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ ముందుభాగం పూర్తిగా దెబ్బతినడంతో అనకాపల్లికి చెందిన డ్రైవర్ నాగరాజు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. తనను కాపాడాలంటూ చేసిన ఆర్తనాదాలతో తోటి డ్రైవర్లు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నాగరాజును బయటికి తీసేందుకు ప్రయత్నించగా అప్పటికే చనిపోయాడు.
News April 13, 2025
కొత్తవలస: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కొత్తవలస మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన సర్వసిద్ధి వినయ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో శనివారం రాత్రి మృతి చెందాడు. వాహనం బలంగా ఢీకొనడంతో అవయవాలు రోడ్డుపై పడి భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వినయ్ కుమార్ (27)కి 2023లో వివాహం జరిగింది.
News April 13, 2025
వైసీపీ పీఏసీ మెంబెర్‌గా మాజీ ఎంపీ బెల్లాన

మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. బెల్లానను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ( PAC) మెంబర్‌గా నియమిస్తూ తాడేపల్లి పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్.జగన్ ఆదేశాల మేరకు 17 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ జాబితాను విడుదల చేసింది.