News April 12, 2025
ఇంటర్ రిజల్ట్స్.. ప.గో జిల్లాకు 10వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 14,260 మంది పరీక్షలు రాయగా 11,948 మంది పాసయ్యారు. 84 శాతం పాస్ పర్సంటేజీతో జిల్లా రాష్ట్రంలోనే 10వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 17,257 మందికి 12,046 మంది పాసయ్యారు. 70 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది.
Similar News
News April 17, 2025
పాలకొల్లు: చాంబర్స్ కళాశాలలో 17న మెగా జాబ్ మేళా

ఈనెల 17 గురువారం ఉ.9 గంటల నుంచి పాలకొల్లు చాంబర్స్ కళాశాలలో ఏపీ ప్రభుత్వ శిక్షణ, ఉద్యోగ కల్పనా సంస్థ సౌజన్యంతో 13 కంపెనీలతో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి ,హెచ్డిబి, డెక్కన్ కెమికల్స్, పానాసోనిక్, ఇండో ఎంఐఎం, ఇసుజు, కాగ్నిజెంట్ వంటి బ్యాంకింగ్, ఐటి, నాన్ ఐటీ సంస్థలకు చెందిన వారు 470 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.
News April 17, 2025
రోడ్డు ప్రమాదంలో పెనుగొండ యువకుడు మృతి

వడలి పిట్టల వేమవరం రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుగొండకు చెందిన తడివాడ భార్గవ్(17) మృతి చెందాడు. స్నేహితుడితో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా వెనుక వస్తున్న వ్యాను టచ్ చేయడంతో మోటార్ సైకిల్ పక్కనే ఉన్న చెట్టుని బలంగా ఢీకొంది. దీంతో భార్గవ్ తలకు బలమైన గాయం కావడంతో ఘటన ప్రాంతంలో మృతి చెందాడు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు.
News April 17, 2025
ప.గో: వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

తణుకు పట్టణంలోని సాంఘిక సంక్షేమ ప్రభుత్వ కళాశాల బాలురు, బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రూ. 18.5 లక్షలు, రూ. 8.31 లక్షలు, రూ.2.41 లక్షల వ్యయంతో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో మూడు వసతి గృహాలకు చేపట్టిన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.