News April 12, 2025
పార్వతీపురం జిల్లాకు 6వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో పార్వతీపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 5,867 మంది పరీక్షలు రాయగా 4,519 మంది ఉత్తీర్ణులయ్యారు. 77% పాస్ పర్సంటేజీతో జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 5,335 మందికి 4,609 మంది పాస్ కాగా 86% పాస్ పర్సంటేజీతో 7వ స్థానంలో నిలిచింది.
Similar News
News September 15, 2025
DSC రిజల్ట్స్: స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌ది మన విజయనగరమే

ఈరోజు విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో దత్తిరాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన కడగల భవాని టి.జి.టి ప్రత్యేక భౌతిక శాస్త్రం విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆమె మరడాం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భర్త, తల్లిదండ్రులు, అత్త మామల సహకారం తనను ఈ స్థాయిలో నిలిపిందని ఆమె తెలిపారు. ఫస్ట్ ర్యాంక్ సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
News September 15, 2025
నిజంగా రూ.1200కు ఉల్లి కొన్నారా?: SV

చంద్రబాబు సర్కారుకు ఉల్లి రైతుల కష్టాలు కనిపించవా? అని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిజంగా రూ.1,200తో ఉల్లిని కొనుగోలు చేస్తే రైతులు ఎందుకు రోడ్లపై పడేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని, వారికి మద్దతుగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
News September 15, 2025
HYD: రూ.1.09 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఈగల్ టీమ్

మత్తు పదార్థాలను తరలించే ముఠాలపై తెలంగాణ ఈగల్ టీమ్ ఉక్కుపాదం మోపింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో కలిసి గతనెల 22 నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్లు నిర్వహించింది. ఇందులో 12 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.1.09 కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.