News April 12, 2025
అనకాపల్లి జిల్లాకు 20వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో అనకాపల్లి జిల్లా విద్యార్థులు కాస్త వెనుకబడ్డారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 10,279 మంది పరీక్షలు రాయగా 6,437 మంది ఉత్తీర్ణులయ్యారు. 63% పాస్ పర్సంటేజీతో జిల్లా రాష్ట్రంలోనే 20వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 9,512 మందికి 6,942 మంది పాస్ కాగా 73% పాస్ పర్సంటేజీతో 25వ స్థానంలో నిలిచింది.
Similar News
News March 4, 2026
తిరుపతి కలెక్టర్‌ను కలిసిన ఖాదీ బోర్డు ఛైర్మన్

తిరుపతి కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్‌ను ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ కెకె చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణపై చర్చించినట్లు సమాచారం. జిల్లా అభివృద్ధికి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని వారు అభిప్రాయపడ్డారు.
News March 4, 2026
నిర్మల్‌లో వందరోజుల కార్యక్రమం ప్రారంభం

బాల్యవివాహాల నిర్మూలనకు జిల్లా యంత్రాంగం 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించాలని ఉద్దేశంతో బాల్య వివాహ రహిత భారత్ కార్యక్రమంలో భాగంగా సంబంధిత అధికారులు ప్రచార రథం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలు విద్యాసంస్థలలో విస్తృత అవగాహన కల్పించనున్నారు. 18,21 సంవత్సరాలు లోపు బాల బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని జరిగే పరిణామాలను వివరించనున్నారు.
News March 4, 2026
సంగారెడ్డి: పరీక్షకు 97.66% హాజరు

సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 53 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 16,959 మంది విద్యార్థులకు గాను 16,562 మంది (97.66%) హాజరయ్యారని, 397 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారని పేర్కొన్నారు.


