News April 12, 2025

చిత్తూరు: అప్పుడు.. ఇప్పుడూ లాస్టే

image

ఈసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలవగా.. గతేడాది సెకండ్ ఇయర్‌ ఫలితాల్లో అట్టడగున నిలిచింది. 2024లో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 10,882 మంది పరీక్షలు రాయగా.. 6,817 మంది పాసై 63 శాతం పర్సంటేజీతో 26వ స్థానానికి జిల్లా పరిమితమైంది. తాజా ఫలితాల్లో ఫస్ట్ ఇయర్‌లో 13,183 మందికి 7,168 మందే పాస్(54%) కావడంతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే లాస్ట్ స్థానంలో నిలిచింది.

Similar News

News April 13, 2025

చిత్తూరు: ఏడాదిలో ఒక కోటి లక్ష రూపాయాల జరిమానా

image

ఏడాది కాలంలో తాగి వాహనం నడిపిన వాహనచోదకులకు కోటి లక్ష రూపాయలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తెలిపారు. 2024 ఏప్రిల్-11 నుంచి నేటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 1,01,52,500 జరిమానా విధించామన్నారు. మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష, రెండవసారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

News April 13, 2025

పులిచెర్ల: బావిలో దిగి బాలుడి మృతి

image

బంతి కోసం బావిలోకి దిగి పైకి రాలేక దిలీప్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పులిచెర్ల మండలం అయ్యవారిపల్లిలో చోటుచేసుకుంది. సురేష్, లత కుమారుడైన దిలీప్ బెంగళూరులో ఉంటున్నారు. ఉగాది పండుగకు అయ్యావారిపల్లికి వచ్చారు. శనివారం సాయంత్రం అవ్వతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. బంతి ఆడుకుంటున్న సమయంలో బంతి బావిలో పడింది. బంతి కోసం దిగిన దిలీప్ పైకి రాలేక మృతి చెందాడు. కల్లూరు ఎస్సై ఘటనా స్థలాన్ని సందర్శించారు.

News April 13, 2025

పులిచెర్ల: బావిలో పడి 12 ఏళ్ల బాలుడి మృతి

image

పులిచెర్ల మండలంలో విషాదం నెలకొంది. అయ్యవారిపల్లెకు చెందిన సురేశ్-లత దంపతుల కుమారుడు దిలీప్ (12) శనివారం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. వారు బెంగళూరు నుంచి ఉగాదికి స్వగ్రామానికి వచ్చారు. పొలం వద్ద చెల్లెలితో దిలీప్ ఆడుకుంటుండగా పొరపాటున బాల్ బావిలో పడింది. దాన్ని తీసుకునేందుకు వెళ్లిన దిలీప్ నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. 

error: Content is protected !!