News April 12, 2025
సుప్రీంకోర్టు సంచలన తీర్పు

గవర్నర్లు పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించింది. ఒకవేళ గడువు దాటితే అందుకు గల కారణాలను గవర్నర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడులో 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ తన వద్ద పెండింగ్‌లో ఉంచడంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు బిల్లుల పరిశీలనకు రాష్ట్రపతికి గడువు అనేది లేదు.
Similar News
News November 4, 2025
రేపే కార్తీక పౌర్ణమి.. ఏమేం చేయాలంటే?

కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే నదీ స్నానమాచరించి, శివలింగానికి రుద్రాభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు. ‘నదీ స్నానం చేయలేనివారు గంగా జలం కలిపిన నీటితో స్నానం చేయవచ్చు. ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసినా, ఆయన కథ విన్నా శుభం కలుగుతుంది. తులసి పూజతో పాటు 365 వత్తులతో దీపం వెలిగించాలి. శివాలయంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం’ అని అంటున్నారు.
☞ కార్తీక పౌర్ణమి గురించి మరిన్ని విశేషాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 4, 2025
కార్తీక పౌర్ణమి: ఉపవాసం ఎలా ఉండాలి?

‘కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండడం మంచిది. అది వీలుకాకపోతే దేవుడిపై మనసు లగ్నం చేస్తూ మితంగా ఆహారం తీసుకోవచ్చు. వాయుపురాణం ప్రకారం.. పెసరపప్పు-బియ్యం కలిపి వండిన పదార్థాన్ని ఒకసారి మాత్రమే తీసుకోవచ్చు. సహజ ఫలాలు, నువ్వులు-బెల్లం ఉండలు, పంచామృతం, తులసినీరు వంటివి కూడా స్వీకరించవచ్చు. అయితే, ఏ ఆహారాన్నైనా ఒకసారి మాత్రమే తీసుకోవడం ఉత్తమం. మాటిమాటికి వద్దు’ అని పండితులు సూచిస్తున్నారు.
News November 4, 2025
మాగాణి భూముల్లో వరికి ప్రత్యామ్నాయ పంటలు

వరి మాగాణి భూముల్లో ఆరుతడి పంటల సాగుతో అధిక లాభం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు, శనగ, పెసలు, మినుము, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, కూరగాయలు, పొద్దుతిరుగుడు, ఆముదం, పత్తి వంటి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటి సాగు వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రైతులకు విభిన్న పంటలతో ఆదాయం పెరుగుతుంది. వరి పంటపై ఆధారపడటం తగ్గుతుంది.


