News April 12, 2025
ఇంటర్ ఫలితాలు.. పార్వతీపురం జిల్లా స్టేట్ ఫస్ట్

ఇంటర్ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఫస్ట్ ఇయర్ 70% ఉత్తీర్ణత సాధిస్తే, సెకండ్ ఇయర్ 81% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతిభ కనబరచడంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచామని ఇంటర్ విద్యాధికారిని మంజుల వీణ తెలిపారు.
Similar News
News December 28, 2025
ప్రకాశం జిల్లాకు సక్రమంగా సాగర్ జలాలు వచ్చేనా..?

ప్రకాశం జిల్లాకు నాగార్జునసాగర్ జలాల సరఫరా మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి జలవనరుల శాఖ అధికారులను శనివారం ఆదేశించారు. తూర్పు నాయుడుపాలెం తనక్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగార్జునసాగర్ నుంచి విడుదలవుతున్న జలాలు తగిన స్థాయిలో జిల్లాకు రాకపోవటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 57 TMCలు సాగర్ జలాలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 34 TMCలు వచ్చాయన్నారు.
News December 28, 2025
Silver.. సారీ..! Stock లేదు!

వెండి పరుగులతో పెట్టుబడి కోసం బిస్కెట్స్‌కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. కానీ కొందామని షాపులకు వెళ్తున్న కస్టమర్లకు నిరాశే ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ షాపుల్లో సిల్వర్ బార్స్ లేవనే సమాధానం వస్తోంది. ఒకవేళ అక్కడక్కడా ఉన్నా 10గ్రా, 15g, 20g బార్స్ తప్ప వందలు, వేల గ్రాముల్లో లేవని చెబుతున్నారు. ఆర్డర్ పెడితే 4-7 రోజులకు వస్తుందని, ఆరోజు ధరకే ఇస్తామంటున్నారు. మీకూ ఇలా అయిందా? కామెంట్.
News December 28, 2025
మెదక్: సండే స్పెషల్.. నాటు కోళ్లకు డిమాండ్

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సండే సందడి కనిపిస్తోంది. నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్ దుకాణాలకు దారి తీస్తున్నారు. బాయిలర్ కోడి కంటే నాటుకోడి రుచిగా ఉంటుందన్న ఉద్దేశంతో చాలామంది వాటిపైనే మక్కువ చూపుతున్నారు. బాయిలర్ రూ.200, మటన్ రూ.800, నాటుకోడి ధర రూ.800 నుంచి రూ.1500 వరకు ధర పలుకుతోంది. మీ ప్రాంతాల్లో ధర ఎలా ఉందో కామెంట్ చెయ్యండి.


