News April 12, 2025

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని రథోత్సవం

image

ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 7వ రోజు శనివారం రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ సీతారామలక్ష్మణ మూర్తులను అర్చకులు పట్టు వస్త్రాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి రథం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.భక్తులు విశేషంగా తరలి వచ్చి కార్యక్రమాన్ని తిలకించారు.

Similar News

News September 19, 2025

ADB: కలెక్టర్ సార్.. మీ కోసమే ఎదురుచూపులు

image

”స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లయినా మా గ్రామానికి రోడ్డు లేక నరకయతన పడుతున్నాం. విద్య, వైద్యం పొందలేక అవస్థలు పడుతున్నాం. వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడితే హాస్పిటల్ వెళ్లలేని పరిస్థితి. నిత్యవసరాలకీ నరకం అనుభవిస్తున్నాం. రోడ్డు సరిగ్గా లేక పిల్లలు చదువులకు దూరమయ్యారు” అంటూ గుబిడి గ్రామస్థులు కలెక్టర్‌కు రాసిన వినతిపత్రం చర్చనీయంగా మారింది. మండల పర్యటనకు రానున్న కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

News September 19, 2025

కాకినాడ జిల్లాకు పేరు మార్చాలని డిమాండ్

image

పిఠాపురం మహారాజా రావు సూర్యారావు బహదూర్ పేరును కాకినాడ (D)కు పెట్టాలని అనపర్తి మాజీ MLA శేషారెడ్డి సూచించారు. తమ ఇన్స్టిట్యూషన్స్ & మహారాజా ఫౌండేషన్ ప్రతియేటా జాతీయ స్థాయి కథ, కవితా సంపుటాల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విద్య, దళితుల కోసం ఆయన ఎంతో శ్రమించారన్నారు. శ్రీకృష్ణ దేవరాయల తర్వాత అదే స్థాయిలో ప్రజలను ఆదరించిన మహనీయుడి పేరును జిల్లాకు పెట్టాలని కోరారు. దీనిపై మీరేమంటారు.కామెంట్ చేయండి.

News September 19, 2025

KNR: ‘పాఠశాలల్లో విభిన్న పద్ధతుల్లో విద్యాబోధన’

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (TLM) జిల్లాస్థాయి మేళాను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విభిన్న పద్ధతులను అనుసరించి విద్యాబోధన చేస్తున్నామన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులున్నారు.